అరచేతిని అడ్డుగా పెట్టి అగ్నిపర్వతాన్ని ఆపుతున్న విఘ్వేశ్వరుడు

by Anukaran |
అరచేతిని అడ్డుగా పెట్టి అగ్నిపర్వతాన్ని ఆపుతున్న విఘ్వేశ్వరుడు
X

దిశ,వెబ్‌డెస్క్: అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని విఘ్నేశ్వరుడిని ఎలా కోరుకుంటామో.. ఆ దేశ ప్రజలు మాత్రం కణకణమండే అగ్నిపర్వతం బద్దలవ్వుకుండా చూడాలని పూజలు చేస్తున్నారు. అంతేకాదు మనం సీజన్ ను బట్టి వినాయకచవితి పండగ జరుపుకుంటే వీళ్లు ఏడాది మొత్తం వినాయక చవితి పండుగను ఘనంగా నిర్వహిస్తారు.

ఇండోనేషియాలోని తూర్పు జావాలో 7,641 అడుగుల ఎత్తులో సందర్శకులను ఆకర్షించే ప్రదేశం మౌంట్ బ్రోమో అనే అగ్నిపర్వతం. అగ్నిపర్వతం పైభాగంలో 700 సంవత్సరాల నాటి మహిమాన్వితమైన విఘ్వేశ్వరుని విగ్రహ విగ్రహం ఉంది. ‘బ్రోమో’ అని పిలిచే విఘ్వేశ్వరుడి విగ్రహాన్ని టెంగ్గర్ మాసిఫ్ తెగ పురాణాల ప్రకారం వారి పూర్వికులు అగ్నిపర్వతం ముందు ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. ఆ విగ్రహమే మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం బద్దలవ్వకుండా కాపాడుతుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అందుకు ప్రతీకగా స్థానిక ప్రజలు ప్రతీరోజూ ‘విది వాసా’ పేరుతో పండుగ జరుపుతారు. ఈ పండుగ సందర్భంలో పండ్లు, పువ్వులను అగ్నిహోత్రం చేసి విఘ్నాలను తొలగించాలని కోరుకుంటారు.

కాగా 2012 రికార్డ్‌ల ప్రకారం ఇండోనేషియాలో 127 ప్రమాదకరమైన అగ్ని పర్వతాలున్నాయి. ఆ పర్వతాల పరిసర ప్రాంతాల చుట్టూ 5మిలియన్ల మంది జీవిస్తున్నారు. మౌంట్ బ్రోమో అగ్నిపర్వతం సరిహద్దుల్లో నివసించే ప్రజలు.., ఆ అగ్ని పర్వతం విస్పోటనం చెందకుండా ఉండేందుకు లంబోదరుడిని పూజిస్తారు.

Advertisement

Next Story