- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2027 నాటికి 7 బ్యాటరీ వాహనాల లక్ష్యం : కియా !
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వాహన తయారీ సంస్థ కియా తన గ్లోబల్ బ్రాండింగ్, భారత్‌లో అమ్మకాల నెట్‌వర్క్ విస్తరణలో భాగంగా వినియోగదారులకు మరింత చేరువ కావాలని భావిస్తున్నట్టు వెల్లడించింది. ఈ నెల ప్రారంభంలో కంపెనీ కార్పొరేట్ లోగో, గ్లోబల్ బ్రాండింగ్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. కొత్త లోగో, బ్రాండ్ గుర్తింపుతో సహా కంపెనీ డీలర్‌షిప్‌లలో మార్పు చేయడం, వినియోగదారుల అనుభవాన్ని మెరుగు పరిచేందుకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు కియా కార్పొరేషన్ ప్రెసిడెంట్, సీఈఓ హో సంగ్ సాంగ్ ఓ వర్చువల్ కార్యక్రమంలో చెప్పారు.
ప్రస్తుతం కియాకు దేశవ్యాప్తంగా 300 కస్టమర్ టచ్‌పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న సెల్టోస్, సొనెట్ మోడళ్లతో మార్కెట్లో విజయాన్ని సాధించామని ఆయన తెలిపారు. కంపెనీ కొత్త బ్రాండింగ్ భారత మార్కెట్‌లో వ్యూహానికి అనుగుణంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాల పట్ల సంస్థ దృష్టి కేంద్రీకరించింది. అంతేకాకుండా 2027 నాటికి కొత్త 7 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానున్నట్టు కంపెనీ పేర్కొంది. 2025 నాటికి గ్లోబల్ బ్యాటరీ వాహనాల మార్కెట్‌లో 6.6 శాతం వాటాను, 2026 నాటికి 5 లక్షల యూనిట్ల వాహనాల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకుంది.