వంద నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
వంద నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటాం.. ఎన్నికల అధికారి వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు, కంటోన్మెంట్ బై ఎలక్షన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాదాపు 8 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 2 వేలకుపైగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలింగ్ విధుల్లో దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని అన్నారు. సీ విజిల్, టోల్ ఫ్రీ ద్వారా వస్తోన్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లో చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. బందోబస్తు నిమిత్తం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయని అన్నారు. దాదాపు 60 వేల మంది రాష్ట్ర పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారని తెలిపారు. వీరితో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది పోలీసులు వస్తారని అన్నారు. కేంద్ర బలగాలు కాకుండా మొత్తం 72 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని వెల్లడించారు. పోలింగ్ కోసం 87 వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 20 వేల బ్యాలెట్ యూనిట్లు స్పేర్‌గా ఉంచుతామని అన్నారు. కాగా, కాసేపట్లో ఎన్నికల ప్రచార ఘట్టం ముగియనుంది.

Read More..

సినిమాలో RRR.. కాంగ్రెస్‌లో డబుల్ ఆర్.. ప్రియాంక గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు



Next Story