- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల సమయంలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్ గూటికి ఎమ్మెల్యే అభ్యర్థి
దిశ, తెలంగాణ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆసిఫాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆత్మారాంనాయక్ కాషాయపార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రాజీనామా చేశారు. అనంతరం హైదరాబాద్‌లో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీని సైతం ఆత్మారాం నాయక్ కలిశారు. ఇదిలా ఉండగా ఆత్మారాం నాయక్ 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ తరుపున పోటీచేశారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మరో మూడ్రోజులు మిగిలి ఉన్న తరుణంలో ఆయన పార్టీ మారండంతో బీజేపీకి షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే ఆదిలాబాద్ స్థానాన్ని సిట్టింగ్‌కు కాకుండా మరో పార్టీ నుంచి వచ్చిన నేతకు ఇవ్వడంతో స్థానికంగా కాస్త వ్యతిరేకత ఏర్పడింది. కాగా ఆ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థి పార్టీ మారడంతో మరింత షాక్ తగిలినట్లయింది.
Read More..
‘ప్రజల సమస్యలు తీర్చినప్పుడు కలిగే ఆనందం.. ఏ పదవిలో లేదు.. రాదు’: మంత్రి కోమటిరెడ్డి