తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా

by srinivas |
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
X

దిశ, ఏపీ బ్యూరో: లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్‌ కుటుంబ సభ్యులకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డా.కెఎస్.జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో గోపినాథ్ జెట్టి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

స్పీకర్ ఓం బిర్లా ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి ఆ తరువాత మూలమూర్తి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్, ఈవో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్, కాఫీ టేబుల్‌ బుక్ అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, భరత్, కలెక్టర్ హరినారాయణన్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed