లాక్‌డౌన్ ఉల్లంఘన.. పోలీసుల ఆగ్రహం

by Shyam |   ( Updated:2020-04-04 22:57:40.0  )

దిశ, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఫారూక్‌నగర్‌లో రాత్రుల్లో లాక్‌డౌన్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ కొందరు మందుబాబులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. విషయం తెలుసుకున్న ఐపీఎస్ అధికారిని రితిరాజ్, షాద్‌నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్‌తో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారూక్‌నగర్‌లో ఇద్దరు వ్యక్తులు మద్యం తాగి పోలీసులకు పట్టుబడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం తాగి విచ్చలవిడిగా తిరుగుతున్న నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రితిరాజ్ తెలిపారు.

Tags: Lockdown, violation, IPS officer, fire, rangareddy, drunk and drive

Advertisement

Next Story