లాక్‌డౌన్‌తో కెరీర్లకు ప్రమాదం : యువీ

by vinod kumar |
లాక్‌డౌన్‌తో కెరీర్లకు ప్రమాదం : యువీ
X

కరోనా సంక్షోభం కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తోంది. వ్యాపారాల్లో నష్టాలు తప్పడం లేదు. ఆదాయ మార్గాలు లేక జనం అల్లాడి పోతున్నారు. కాగా, క్రీడారంగంలో ఇప్పుడిప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన వారికి ఇదొక పరీక్షా సమయం కానుంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే కొంత మంది క్రీడాకారుల కెరీర్లు నాశనమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై తాజాగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘నా కెరీర్ ఆరంభంలో కనుక లాక్‌డౌన్ పరిస్థితులు ఉండుంటే, నేను ఎప్పుడో కనుమరుగయ్యే వాడినని.. ఎందుకంటే కెరీర్ మొదట్లో గాడిలో పడేందుకు నేను చాలా కష్టపడ్డానని’ చెప్పాడు. లాక్‌డౌన్ కారణంగా క్రీడాకారులు ఎక్కువ సమయం ఇంట్లో కూర్చోవడం అంత మంచిది కాదని.. ఆట లయ తప్పడం, ఫిట్‌నెస్ కోల్పోవడం వల్ల కెరీర్లు నాశనమయ్యే అవకాశం ఉంటుందని యువీ అంటున్నాడు.

కాగా, ఎప్పుడూ ఒత్తిడిలో ఉండే క్రీడాకారులకు మాత్రం ఈ లాక్‌డౌన్ సమయంలో కుటుంబం, స్నేహితులతో గడిపే అవకాశం దక్కిందని అన్నాడు. ‘మనమంతా చాలా లక్కీ.. మనం 3 లేదా 4 గదులున్న ఇండ్లల్లో ఉంటున్నాం. కానీ, బయట ఎంతో మంది పెద్ద కుటుంబంతో ఒకే గదిలో ఉంటున్నారని.. వారు ఇప్పుడు ఎంతో ఆందోళనలో ఉన్నారు’ అని యువి తెలిపాడు. అయితే, ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ మే 3 వరకు ఓపిక పట్టాల్సిందేనని అన్నాడు. ఈ ఖాళీ సమయంలో యువ క్రీడాకారులు తమ ఫిట్‌నెన్‌ను మాత్రం కాపాడుకోవాలని యువీ సూచించాడు.

Tags: Yuvraj Singh, Lockdown, Career, Young sportsman, Fitness

Advertisement

Next Story

Most Viewed