- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాక్ డౌన్ తీరు పర్యవేక్షణ
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో లాక్ డౌన్ అమలును ఎలా చేపడుతున్నారో తెలుసుకునేందుకు తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సీ చంద్రయ్య స్వయంగా శనివారం పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లపరిధిలోని జూబ్లీ చెక్ పోస్ట్, సీఎం క్యాంపు ఆఫీస్, తార్నాక, ఉప్పల్ రింగ్ రోడ్, నాగోల్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, మదీనా, చార్మినార్, మెహదీపట్నంలో లాక్ డౌన్ అమలు చేస్తున్న తీరును పర్యవేక్షించారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీస్ సిబ్బందిని లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు ఈ లాక్ డౌన్ తమ మంచికే అని అభిప్రాయం వ్యక్తం చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అహర్నిషలు పాటుపడుతున్న పోలీస్, ఆరోగ్య, పారిశుధ్య, ఇతర అత్యవసర విభాగాల్లో సేవలందిస్తున్న వారికి అభినందనలు తెలిపారు.
Advertisement
Next Story