- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
50 శాతం తగ్గిన ఇంధన వాడకం!
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో లాక్‌డౌన్ విధించడం వల్ల ఇంధనానికి పూర్తీగా డిమాండ్ పడిపోయింది. . శుక్రవారం కేంద్రం విడుదల చేసిన లెక్కల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి 15 వరకూ అన్ని రకాల ఇంధనాల డిమాండ్ 50 శాతం క్షీణించినట్టు వెల్లడించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థల లెక్కల ప్రకారం లాక్‌డౌన్ ఆంక్షలతో దేశంలో అన్ని రకాల వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో రెండు వారాల్లో పెట్రోల్ వినియోగం 65 శాతం తగ్గిపోగా, డీజిల్ 60 శాతం క్షీణించినట్టు కేంద్ర వెల్లడించింది. విమానయాన రంగంలోనూ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) వినియోగం ఏకంగా 93 శాతం తగ్గింది. అయితే, లాక్‌డౌన్ సమయంలో వంట గ్యాస్ వినియోగం అధికంగా 21 పెరిగినట్టు కేంద్రం తెలిపింది.
గతేడాది గణాంకాలను పరిశీలిస్తే… 2019, ఏప్రిల్‌లో 24 లక్షల టన్నుల పెట్రోల్ విక్రయం జరిగింది. ఏటీఎఫ్ వినియోగం 6.45 లక్షల టన్నులు, డీజిల్ అధికంగా 73 లక్షల టన్నుల వినియోగం నమోదైంది. దేశవ్యాప్తంగా కొవిడ్-19 ను నిలువరించేందుకు కేంద్రం మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. అయితే, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలగకుండా ఈ నెల 20 నుంచి కొన్ని సంస్థలకు, ఈ-కామర్స్ కంపెనీలకు కేంద్రం సడలింపు ఇవ్వనుంది. అంతేకాకుండా ఎయిర్ కార్గో, పోర్ట్ కార్యకలాపాలకు కూడా సడలింపు ఇవ్వనుంది. ఈ సడలింపులతో మళ్లీ ఇంధనానికి డిమాండ్ పెరిగే అవకాశాలున్నాయని విశ్లేషలు భావిస్తున్నారు.
Tags: coronavirus, crude oil, LPG, Oil, lockdown impact