‘స్థానిక ఎన్నికలు’ ఇప్పట్లో ఉండవ్ : మేకపాటి

by srinivas |
‘స్థానిక ఎన్నికలు’ ఇప్పట్లో ఉండవ్ : మేకపాటి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో కష్టమేనని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. అసలు ఆ ఆలోచన ఇంకా చేయలేదని స్పష్టంచేశారు. నవంబర్, డిసెంబర్ నెలలో మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తంచేశారు.

దసరా పండుగ తర్వాత కరోనా కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారని గుర్తుచేశారు. రాష్ట్ర ఎన్నికలు రాజ్యాంగం ప్రకారం జరిగి తీరాల్సిందేనని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికలను స్థానిక సంస్థలతో పోల్చకూడదని మంత్రి హితవు పలికారు.

Advertisement

Next Story