దృశ్యావిష్కారం

by Ravi |   ( Updated:2025-03-17 00:45:40.0  )
దృశ్యావిష్కారం
X

కొన్ని కొన్ని అపురూప దృశ్యాలు

కన్నుల్లో చిక్కి పెన్నులోంచి పారుతాయి

రొమ్ము నుంచి పాపాయి పాలు తాగే తమకం

తదేకమైన పసి చూపుల్లోని పారవశ్యం

తల్లి కండ్లల్లో మెరుస్తున్న అనుబంధం

ఇద్దరి మధ్యా రూపొందిన పేగు బంధం

అపుడే ఈనిన బర్రె పెయ్య

మాయ విడిచిన వెంటనే బిడ్డను చూస్తూ

దుడ్డె దేహమంతా ఎకాఎకిన నాకే చిత్రం

తల్లితనాన్ని పంచుతున్న గోముతనం

ఊరంతా తిరిగిన ఊర పిచ్చుక

నోట కరుచుకొని తెచ్చిన పురుగాహారం

పిట్ట పిల్ల నోటికి సుతారంగా అందించే తపన

పిట్టగూడంతా కిసకిసల పసి సంగీతం

నడుస్తూ నడుస్తూ చూస్తూ చూస్తూ

వీక్షణాలను అక్షరాల్లోకి బదలాయించడమే

అసలైన దృశ్యావిష్కార సంబురం

- అన్నవరం దేవేందర్

94407 63479

Next Story

Most Viewed