స్మృతి..!

by Ravi |   ( Updated:2024-12-29 23:01:12.0  )
స్మృతి..!
X

ఎప్పటిలాగా లేని మనస్సుకు

ఎందుకో ఈ కలవరపాటు

క్షణక్షణం ఆందోళన బాటలోని

నా ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల

ఊపిరిగుండా

ఈ చలికాలపు వేదన ఎంటో..?

అందరి మనసు ఎరిగిన

ఈ రాతిరి వెన్నెల

నా గుండె గవాక్షలలోని

బరువును దింపలేక పోయి

దాకున్నది ఎందుకో..!?

నింగిన పొడిసిన చుక్కలు

జ్ఞాపకాలయి పర్సుకున్న వేల

నా యదను తాకుతున్నది

ఈ స్మృతి గీతం

అమరుల స్వప్నరాగమై

అందివచ్చే చోట

అది నూతన వసంతమౌను కదా..!

-వంగల సంతోష్

95737 86539

Advertisement

Next Story