చావు ఇపుడు ఎవర్నీ ఎత్తుకుపోలేదు

by Ravi |   ( Updated:2024-10-20 23:30:28.0  )
చావు ఇపుడు ఎవర్నీ ఎత్తుకుపోలేదు
X

వాళ్ళు చావును జయించిన వాళ్ళు

జైలు గోడలకు పాటలు నేర్పిన వాళ్ళు

ఇనుప ఊచలకు జానపద సంగీతం నేర్పిన వాళ్ళు

జైలుపై నక్షత్రల దుప్పటి కప్పి

గోడల మధ్య రహస్య సంభాషణ చేసినవాళ్లు

వాళ్ళెక్కడ వున్నా

నీ నా విముక్తినే కోరుకున్న వాళ్ళు

రెడ్ కారిడార్ ఇండియా అంతా

రూపొందించిన వాళ్ళు

వాళ్లకు చావేంటి

ప్రేమొక్కటే గానం చేసిన

మన కాలం కబీర్లు వాళ్ళు

ఎర్ర జెండా ఎత్తి ఉంచండి

మలయ సమీరంలా వచ్చి తాకుతారు

పిడికిలి ఎత్తి పట్టి ఉంచండి

నరనరానా ఉక్కు సంకల్పంతో ఎత్తి పడతారు

సాయి నిబ్బరంగానే వున్నాడు

చావును నిరాకరించిన వాడు కదా

చూడు చిరు నవ్వుతో తిరిగి వస్తాడు.

(కామ్రేడ్ జిఎన్ సాయిబాబా స్మృతిలో)

కెక్యూబ్ వర్మ

94934 36277

Advertisement

Next Story

Most Viewed