- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చల్లంగ చూడమ్మ
బతుకమ్మ ఒక పెద్ద పూల పండగ
చెట్టు ఆకుల కణుపున పూచే
అందాల పూలలోగిలిలో ఆకులు పూలు
అన్ని బతుకమ్మ ఇష్టప్రదాలే
బంగారు పల్లెమైన వెదురు శిబ్బి ఐనా
బతుకమ్మ ఆటకు పూలే శ్రేష్టము
తంగేడు పువ్వులు గుమ్మడి పువ్వులు
తామే బతుకమ్మకు తాగుదుమన్నట్టుగా
ఒదిగిపోయే పూల వరుసలన్నీ కలిసి
మానవజాతికే పరికించే పనిని కల్పించే
పసుపు గౌరమ్మ ముద్దుగుమ్మ తానిష్టంగా చేసి
బతుకు వరము పొందే బతికినంత వరకు
కుంకుమ రంగుల ఎరుపైన పూలతో
చెక్కిళ్ళు ఎరుపెక్క చకచకా కోసేసి
ఎత్తైన పీటపై ఏడేడు వరుసల
బంతి మల్లెపూల బారైన మాలల
బతుకమ్మ అందము చక్కగా పెరుగంగ
ఉయ్యాల పాటలు ఊపందుకునే వేళ
తొమ్మిది రోజుల పండగై సద్దుల
బతుకమ్మకు సత్తుపిండ్లతో
మన ఆరాధ్య దైవానికి నైవేద్యమియంగా
ఆఖరి రోజున హారతులు ఇచ్చేము
పోయిరా బతుకమ్మ పోయిరావమ్మా అంటూ
అతివలంతా నిన్ను ఊరు చెరువులో
విడువంగ మమ్మలను నీవు
ఎప్పుడు విడువద్దని వేడుకుంటూ
వనితలంతా నీపాట పాడుకునే వేళ
చల్లంగాచూడమ్మ …బంగారు బతుకమ్మ ..!
బొమ్మిదేని రాజేశ్వరి
90527 44215
- Tags
- Poem