- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇల్లాలు
పొద్దు పొడిస్తే బతుకంతా రణరంగమే
కళ్ళు తెరిచి పద్మవ్యూహంలో జొరబడి
వీరంగం చేయడమే ఆమె విధి నిర్వహణ
బరువులు బాధ్యతలు
తెచ్చి పెట్టుకున్న బంధాలు
విధాత రాసిన కర్మలు
ఏ ఒక్కటి ఊపిరి
పీల్చుకోనివ్వవు ఒక్క క్షణం.
అందరూ పల్లకి ఎక్కి కూర్చుని
బోయిలు ఎవరంటే
భుజాలు తడుపుకుంటారు.
జరిగిన తప్పులకు
జవాబుదారిని చేస్తారు
ఉరిమే చూపులతో ప్రశ్నిస్తారు.
అందరికీ ఆదివారం సెలవు
మరి ఆమెకి.. రోజు ఉండే
ఒక క్షణం విరామానికి
ఆ రోజు సెలవు.
ఎన్నెన్నో ప్రణాళికలు
ఎన్నెన్నో పూజలు
కనిపించని దేవుళ్ళు
అందరికీ మొక్కులు
ఆమె కోరిక ఒక్కటే
ఆ కుటుంబ క్షేమం
ఇలా అలసి సొలసి
ఆలోచనతో మస్తిష్కం వేడెక్కి
రక్తం మరిగి మరిగి గుండె బెదిరి
ఆ నిర్జీవమైన కళ్ళు
తీరని బాధ్యతలను చూస్తూ
ఆ క్షణంలో కూడా... బాధ్యతను
మరిచిపోని మహా ఇల్లాలు.
మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
94917 92279
- Tags
- poem