- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కాలం కాల్వలో పొంగే రుధిరం
పువ్వులు ప్రేమతో భావ కవిత్వం అల్లితే
కొడవలి నాగలి పిడికిలితో
అభ్యుదయం మాట్లాడుతుంది
సుతి మెత్తగా పువ్వులు
ప్రేమ కావ్యమై నిలుస్తుంటే
ఎర్రటి రంగు రుధిరమై
కాలం కాల్వలో పొంగుతుంది..
ఆకలి గొంతుకు నాగలి శ్రమిస్తుంటే
కలుపు మొక్కలకు కొడవలి ప్రజ్వరిల్లుతుంటే
పిడికిలి బిగించిన చేయి కరవాలమైనడుస్తుంటే
మౌనపు కంఠానికి అభ్యుదయం అడుగై నడుస్తుంది...
ఎర్రటి సూర్యుని నెత్తిపై మట్టి గంపల మోస్తూ
నల్లటి రాక్షస బొగ్గును ఇనుప కండలతో కదిలిస్తూ
గనిలో పనిలో చెమట చినుకులు చిందిస్తూ
ఎరుపెక్కిన కళ్ళలో నిప్పుల రవ్వలు దర్శిస్తున్నాయి...
ఆదిమ జాతికి నూలు పోగులు సమర్పించి
రాట్నం పైనా వస్త్రమును అందంగా అమర్చి
సాలెగూడులా సొగసైన వస్త్రాన్ని సమకూర్చి పెట్టే
దారపు పోగుల రచనలో శ్రమకు రూపం కల్పించే....
కమ్మరి కుమ్మరి వేద శాస్త్ర ప్రవీణులై
కంసలి మంగలి విశ్వలంకార శోభితులై
సమస్త కుల వృత్తులు విజ్ఞాన శాస్త్ర యోధులై
విశ్వకళ్యాణానికి నిత్య హారతులు సమర్పించిరి..
ప్రపంచ సౌభాగ్యం శ్రామికుడి కాగడా అయి వెలుగుతూ
వారి రక్తమే ఇంధనంగా భోగభాగ్యమై నిలుస్తూ
చెమట బిందువులు నేలపై పచ్చని కోకగా మెరుస్తూ
ధరిత్రిలో దరిద్రుడుగా జీవనవేదం వినిపిస్తున్నారు...
ఆదిమ శాస్త్రవేత్తలు జగద్గురువులు శ్రామికులే
ప్రతి వస్తువును సృష్టించిన అపరబ్రహ్మలు
నేలపైన నడియాడే జ్ఞానం పంచే నిధులు
సృష్టికి ప్రతి సృష్టి చేసిన మరో విశ్వామిత్రులు వారే...
కాల గమనములో మార్పులకు ప్రమిదలు
పెత్తందారీ చేతిలో ఆయుష్షు ఉంచిన ఒత్తులు
వెలిగేందుకు ఇంధనం కరువై జ్యోతులు
నేడు మిణుగురు పురుగులా
బ్రతుకులు ఈడుస్తున్నారు..
కొప్పుల ప్రసాద్
98850 66235
- Tags
- Poem