రాబోయే రోజుల కోసం!

by Ravi |   ( Updated:2023-06-18 18:30:43.0  )
రాబోయే రోజుల కోసం!
X

తిరిగి రాని కాలంలో

చెరపలేని గతం చేసిన గాయాలతో

వేచి చూస్తున్నామా రాబోయే రోజుల కోసం!

మధురమైన కలల ప్రపంచంలో

జీవించాలని మరచితిమా

మనుగడ నైపుణ్యాలను!

చేరుకోలేని ప్రయాణం కోసం

చురుకైన సాహసమా

హర్షించగలిగే తర్కమా!

తెలుపలేని భావనతో

తెలుసుకోవాలనే తపననా

చేరువన లేని వాటికై!

అలుపేలేని ఆశయమా

ఫలించని ఫలితమా..

రాచకొండ సాగర్

70958 22883

Advertisement

Next Story