నాన్న

by Ravi |   ( Updated:2023-06-18 18:30:43.0  )
నాన్న
X

తప్పటడుగులకి ఆసరాగా

వేలు పట్టుకు నడిపిస్తూ

తప్పిపోని జ్ఞాన మార్గాన్ని వేస్తూ

స్కూల్‌‌కి వెంట తీసుకెళ్ళి,

సాహితీ మిత్రులతో సంభాషించే నాన్న

భుజంపై చేయి వేస్తూ నా స్నేహానుబంధం,

టీనేజ్‌‌లో ఉండే సహజ అమాయకత్వం

అస్పష్టతలను దూరం చేస్తూ నాన్న పంచిన ప్రేమ

సదా విద్యార్థిగా ఉంటూ సమాజానికి గురువై

భగత్‌సింగ్ చరిత్రని తెలుగు జాతికి అందిస్తూ

నా ఊహలకు ఒక రూపాన్ని ఇస్తూ

కుల అహంకారాన్ని ద్వేషించే నాన్న

నేర్పిన సమతా భావం....

భారతీయ దర్శనాన్ని ఆకళింపు చేసుకున్న

నాన్న దార్శనికత నాలో

ఆవిష్కరించిన దృక్పథాన్ని

సమాజ శ్రేయస్సు కోసం జీవించాలనే

నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన తీరు...

మదర్స్ డే ని, ఫాదర్స్ డే ని

విడదీయలేనంతగా అమ్మా నాన్నల

ప్రేమ పూరిత జీవితానుబంధం...

ప్రభాకరుడులో లీనమైన ఉషస్సులా

నా జీవితాన్ని అల్లుకున్నది'

- ఉషస్సు

Advertisement

Next Story