- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోరలు చాచిన మగాహంకారం
సినిమా సంస్కృతి నుంచి అత్యాచారం మానవులలో వ్యాపించి, ఇంటర్నెట్ ద్వారా అంతు లేకుండా పరివ్యాప్తం అవుతున్నది. అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేని అహంకారానికి మద్యం, డ్రగ్స్ బానిసత్వం మరొక కారణం. మద్యపానం ఆరోగ్యాలను నాశనం చేస్తుంది. దీని వలననే నేరాలు, ఘోరాలు కొనసాగుతున్నాయి. మద్య నిషేధం, డ్రగ్స్ కంట్రోల్‌తో, పోలీసు వ్యవస్థలో జోక్యం లేకపోవడం వలన ఈ విచ్చలవిడితనం తగ్గించవచ్చు. ఆడపిల్లలు కూడా మగాళ్లను చూస్తే మృగాలు కూడా అయి ఉండవచ్చు అనుకోవాలి. అంతేగానీ, వారితో అమాయకంగా వ్యవహరించడం కూడా ముప్పే అనుకోవాలి. ఏమైనా సమాజం నుంచి అత్యాచార సంస్కృతిని తరిమి వేసి సర్వ సమానత్వం స్నేహాపూరిత వాతావరణం కల్పంచాల్సి ఉంది.
మగ అహంకారుల దుర్మార్గాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అత్యాచారాలు సులువుగా చేస్తున్నారు. బాలికల మీద మైనారిటీ తీరని మగ పోరగాండ్లు క్రూరత్వం ప్రదర్శిస్తున్నారు. ఇది తప్పు అనే కనీస స్పృహ వారికి లేకుండా పోయింది. జింక పిల్ల మీద క్రూరమృగం దాడి చేసినట్టు తరిమి తరిమి తీసికువచ్చి మరీ దారుణానికి తెగబడుతున్నారు. పైగా ఆ విశృంఖలత్వం తర్వాత విక్టరీ పోజులతో సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతున్నారు. ఇలాంటి అంశాలను చదువుతుంటే జుగుప్స కలుగుతుంది. ఇంత దౌర్జన్యం, ఇంత విచ్చలవిడితనం, ఇంత చేసినా 'ఏంకాదు' అనే బరితెగింపు భావన వాళ్లకు ఎట్లా వస్తుంది? బలవంతంగా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక దాడి చేయడం అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇది నేరమని తెల్సినా పట్టింపులేని తనం ఎందుకు? ఇంత దయా రహితంగా ఉండడం ఎట్లా సాధ్యమవుతుంది? ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజులు భయంకరంగా ఉంటాయననే చెప్పవచ్చు.
నిజానికి 'రేప్' సంస్కృతి మన సమాజంలో ఇప్పుడు కన్పిస్తున్నట్టు బలత్కారంగా లేదు. కొద్ది ముందు కాలంలో ఎవరైనా ఇద్దరికి ఇష్టాలు ఏర్పడితే, పరస్పర ఆమోదంతో రహస్యంగా కల్సుకునేవారు. ఏ ఒక్కరికి ఇష్టం లేకున్నా ఎవరి దారి వారిదే. భూస్వామ్య వ్యవస్థలో ఆడవారికి ఇష్టం లేకున్నా ఫ్యూడలిస్ట్‌లు మహిళలను పిలిపించుకునేవారు తప్పితే, మేక మీద తోడేళ్లు పడ్డట్టు ఉండేది కాదు. ఇదంతా సినిమా సంస్కృతి నేర్పిన దుర్మార్గం. అందులో రేప్ సీన్‌ను దారుణంగా చిత్రీకరిస్తున్నారు. ఆడ మనిషి హాహాకారాలు చేస్తుంటే మగాడు వికటాట్టహాసం చేస్తూ బలత్కార దాడి. నలభై ఏండ్లుగా ప్రేక్షకులు చూసి చూసి 'ఇట్లా ఆడవాళ్లను అనుభవించాలి, ఇట్లా సంగతి చూడాలి' అనే ప్రేరేపణ సమాజంలో చెలామణి అయ్యింది. అటు తర్వాతనే ఈ రేప్ సంస్కృతి వ్యాపించింది.
వారి జోక్యంతోనే అంతా
రేప్ గానీ మరేదైనా కానీ పేదవాడు, వెనకాముందు ఎవరూ లేని వాడు చేస్తే ఒక రకం. ధనవంతుడు, రాజ్యం, రాజకీయ పార్టీల అండదండలున్నవాడు చేస్తే మరోరకంగా ఉంటున్నదన్నది అందరికీ తెల్సిన విషయమే. నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం లేదు. 'ఏం కాదు నాకు' అన్న అభయం ఉన్న తర్వాత నేరాలు సాగుతూనే ఉంటాయి. ముందుగా రాజకీయ ప్రజాప్రతినిధుల ప్రమేయం పోలీసుల మీద ఏ మాత్రం ఉండకుండా ఉంటే నేరాల విచారణ సజావుగా సాగుతుంది. శిక్షలు సరిగ్గా పడతాయి. కానీ, రాజకీయ ప్రజా ప్రతినిధి వేలు పెట్టనిది ఎక్కడ? అన్నిటి మీద వాళ్ల ప్రభావంతో పోలీసు వ్యవస్థ స్వతంత్రత కోల్పోతోంది. శిక్షాస్మృతి, నేర నిరూపణ, పరిశీలన పరిశోధన కన్నా పై నుంచి వచ్చిన ఆర్డర్ ప్రకారం డ్యూటీ నడుస్తున్న తరుణంలో అత్యాచార సంస్కృతి పెరిగిపోతున్నది. పోలీసు వ్యవస్థలో ప్రభుత్వాల జోక్యం అసలే ఉండొద్దు. న్యాయ వ్యవస్థకున్న స్వతంత్రం ఉండాలి. కానీ, అది జరగుతది అనేకోలేము. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా పోలీసు వ్యవస్థను తమకు అనుకూలంగానే వినియోగించుకుంటున్నది.
ఇంటర్నెట్‌తో ప్రమాదం
మహిళలు కూడా మగవాళ్లతో సమానం కాదు, మరింత ఎక్కువ జ్ఞానం ఉండాలి. ఎందుకంటే సృష్టికి ప్రతి సృష్టి చేసేది మహిళామూర్తి. అసలు ఇలాంటి స్థితిలో వారి పట్ల గౌరవం కలిగే విధంగా విద్యార్థులకు పాఠ్యాంశాలు ఉండాలి. ముందు చెప్పినట్లుగా, ఒక్క సినిమాలలోనే రేప్ సంస్కృతి పుట్టుక రాలేదు. సీరియల్స్‌లో కూడా ఇలాంటి వెగటు కనిపిస్తుంది. అడల్ట్ నెస్ వయస్సు తర్వాత యువతీ యువకులలో కలిగే హార్మోన్ల ప్రభావం వలన పరస్పర విరుద్ద ఆకర్షణలు కలుగుతాయి. వాటి పట్ల అవగాహన చైతన్యం విద్యార్థులకు రావాలి. శృంగారం పట్ల కూడా శాస్త్రీయమైన చైతన్యం ఉండాల్సింది కానీ, మిడిమిడి జ్ఞానం గల స్నేహితుల సంభాషణలతో తప్పనిసరి అని తెలియక పోతున్నారు.వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇంటర్నెట్‌లో పోర్నోగ్రఫీ యూట్యూబ్‌లలో లేని విషయం లేదు. ఏది కావాలంటే అది. లక్షలాది వీడియోలు వస్తున్నాయి. వాటితో ప్రేరేపితం కావడం వలన దుర్ఘటనలు జరుగుతున్నాయి.
సినిమా సంస్కృతి నుంచి అత్యాచారం మానవులలో వ్యాపించి, ఇంటర్నెట్ ద్వారా అంతు లేకుండా పరివ్యాప్తం అవుతున్నది. అత్యాచారాలకు అడ్డూ అదుపూ లేని అహంకారానికి మద్యం, డ్రగ్స్ బానిసత్వం మరొక కారణం. మద్యపానం ఆరోగ్యాలను నాశనం చేస్తుంది. దీని వలననే నేరాలు, ఘోరాలు కొనసాగుతున్నాయి. మద్య నిషేధం, డ్రగ్స్ కంట్రోల్‌తో, పోలీసు వ్యవస్థలో జోక్యం లేకపోవడం వలన ఈ విచ్చలవిడితనం తగ్గించవచ్చు. ఆడపిల్లలు కూడా మగాళ్లను చూస్తే మృగాలు కూడా అయి ఉండవచ్చు అనుకోవాలి. అంతేగానీ, వారితో అమాయకంగా వ్యవహరించడం కూడా ముప్పే అనుకోవాలి. ఏమైనా సమాజం నుంచి అత్యాచార సంస్కృతిని తరిమి వేసి సర్వ సమానత్వం స్నేహాపూరిత వాతావరణం కల్పంచాల్సి ఉంది.
అన్నవరం దేవేందర్
94407 63479