- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిటాపటా చినుకులతో కురిసిందీ వానా
వాన అంటే అందరికీ సంబురమే. పిల్లలకు ఇదొక ఆటవిడుపు. పెద్దలకూ వర్షంలోనూ తిరగాలనిపిస్తది. వాన ధారలలో తేలిపోవడం ఒక సరదా. నీటి ధారలలో కల్సిపోవడం మరొక సరదా. రకరకాల పండ్లు, రకరకాల పక్షులు, రకరకాల అడవి అందాలు, ఊరూవాడ, చెరువు-పొలం, నది-కాలువ, కుంట-బాయి బంధం ఎక్కడ చూసినా నీళ్లు. నీళ్లలో చేపలు ఈతను తదేకంగా చూస్తే అదొక తాధ్యాత్మిక ఆనందం.
వాన తనివి తీరా కురిసింది. భూమి దామారా తడిసింది. మేఘాలలో దాగున్న సముద్రం చెలియలి కట్టలు తెంచుకుంది. ఆకాశం నుంచి నేల మీదికి చినుకులు చినుకులై ధారలు ధారలుగా పారుతున్న ప్రవాహం. భూదేవి మీద నదులు పాదరసమైన నడకలు. చెరువులు, ఒర్రెలు, రిజర్వాయర్లు, ఆనకట్టలన్నీ కొప్పురం కొప్పురం నిండిన కుండలు. చెర్ల చేపలు ఎదురెక్కుతున్నయి. మత్యృ సంపద జలకాలాటలు జలకాలాటలే. జలచర జీవులలో చైతన్య జీవనం. ఎక్కడ చూసినా నీళ్లే. నీట మునిగిన పొలాలు, ఊర్లు, ఇండ్లు, నదుల పక్కన నివసిస్తే నది కన్నెర్ర చేస్తది.
చెరువులను ఆక్రమించుకున్న కాలనీలకు కాల పరీక్షనే. 'కాలంబు రాగానే కాటేసి తీరాలె' అన్నట్టు నీళ్లకు కాలం వచ్చింది. వాటి తావుల్లో కట్టుకున్న ఇండ్లకు ముప్పు వచ్చింది. అయినా ఇండ్లు కట్టుకున్నోళ్లు అమాయకులు. దాని అడుగు జాగను ఫ్లాట్లు ఫ్లాట్లుగా చేసి అమ్ముకున్న రియల్ఎస్టేట్ మారాజులను అనాలె. వాళ్ల రాజకీయాలను అనాలె. సూసి సూడనట్టు నటించే యంత్రాంగంను అనాలె. ఏది ఎక్కువైనా నష్టమే. ఆరేడు రోజులు కుండ కుమ్మరించినట్టు నీళ్లు మేఘాలకు చిల్లి పడిందా? మీద నల్లాలు బంద్ చేయలేదా? అన్నట్టు కాలు బయట పెట్టనీయకుండా నీళ్లు.
బతుకు పూలు జల్లి
భూమి పువ్వు పువ్వోలె నానింది. పొలం బురద బురద అయ్యింది. నేలంతా జలకళ నిండింది. సూర్యుడు ఎక్కడికి పారిపోయి దాక్కున్నడు. ఇగ వస్తడు కావచ్చు చూడాలి. భూమి, చంద్రుడు, సూర్యుడు, ఆకాశం, మేఘాలు వాతావరణం ఇదొక ప్రకృతి. దీన్ని చెరబడితేనే, చెడగొడితేనే ముప్పు. అప్పుడప్పుడు ఇలా భయపెడుతది. కొన్ని సంవత్సరాలు అసలు వానలే పడయి. భూమి లోపల పాతాళంలోకి ఇంకిపోయే నీళ్లు తాగుదామంటే బిందెడు నీళ్ల కరువు. కొన్నేండ్ల దాకా మడి పారది. చెర్లు బోర్లేస్తయి. నదులు ఎండిపోతయి. కరెంటు రాదు, రిజర్వాయర్ల నీళ్ల సుక్క లేదు. అదొక కరువు. కన్నీళ్ల వాతావరణం. ఇప్పుడు ఇదొక నీళ్ల వాతావరణం. వర్షాలకు అరణ్యం నవ్వుతది. చెట్లు చేమలు పచ్చగయి పెరుగుతయి. వృక్షాలు మహా వృక్షాలు అయితయి. పంటలు విరివిగా పండుతయి. వడ్లు వడ్లు బియ్యం బియ్యం. ఇగ పంటలే పంటలు. పంటలెక్కువ తినేవాళ్లు తక్కువ కొనేవాళ్లు లేక కొన్నిచోట్ల గోదాములలో మరిుగిపొతయి.
విడిపోని బంధమిది
ప్రకృతిని ప్రకృతిలాగే ఉంచితే మంచిది. అసలు మనిషే మనిషి కాకుండా పోయి నేచర్ నాశనం చేస్తున్నారు. క్రిమి సంహారక మందులు భూమిని మన్నును నాశనం చేసే మందులు పంటలకు కొట్టడం వల్ల నేల స్వభావం మారిపొతది. చెత్త చెదారం వృథా వ్యర్థాల కలయికల వల్ల సముద్రాలు నదులు కాలుష్యం చేస్తున్నారు. మనిషి వ్యాపారం కోసం, పైసల కోసం లాభం కోసం ప్రకృతిని నాశనం చేస్తున్నడు. తాను అన్ని రకాల అనారోగ్యం పాలవుతున్నడు. ఏది ఏమైన వాన అంటే అందరికీ సంబురమే. పిల్లలకు ఇదొక ఆటవిడుపు. పెద్దలకూ వర్షంలోనూ తిరగాలనిపిస్తది. వాన ధారలలో తేలిపోవడం ఒక సరదా. నీటి ధారలలో కల్సిపోవడం మరొక సరదా. రకరకాల పండ్లు, రకరకాల పక్షులు, రకరకాల అడవి అందాలు, ఊరూవాడ, చెరువు-పొలం, నది-కాలువ, కుంట-బాయి బంధం ఎక్కడ చూసినా నీళ్లు. నీళ్లలో చేపలు ఈతను తదేకంగా చూస్తే అదొక తాధ్యాత్మిక ఆనందం.
అన్నవరం దేవేందర్
94407 63479