- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేము తాగే మందు మహా కాస్ట్లీ..
దిశ, శేరిలింగంపల్లి: మన దగ్గర మద్యానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. లాక్ డౌన్ సమయంలో కొద్దిరోజులు వైన్స్ తెరుచుకోకపోతేనే నాలుకలు తిమ్ముర్లు ఎక్కాయని, ఒళ్లు అదుపులో లేదంటూ పలువురు మందుబాబులు నానా ఇబ్బందులు పడ్డ విషయం తెలిసిందే. మద్యానికి అంతలా అలవాటు పడ్డారు జనాలు. ఇంకేముంది ఇదే అవకాశంగా ఆఫ్టర్ లాక్ డౌన్ ధరలను అమాంతం పెంచేసింది సర్కార్. అయినా మన మందుబాబులకు అదో లెక్కా.. రేట్ ఎంతన్నది కాదు. చుక్క పడిందా లేదా అన్నదే ఇంపార్టెంట్ అంటున్నారు. అలా అని అందరూ వందల రూపాయలు వెచ్చించి మద్యాన్ని సేవించడం లేదు. కానీ కొందరు మాత్రం వేల రూపాయల విలువైన మద్యాన్ని కూడా గుటుకున మింగేస్తున్నారు. అయితే తాగేవారందరిని చీప్ లిక్కర్ అని చీప్ గా తీసేయకండి.. మేము తాగే మందు మహా కాస్ట్లీ అంటున్నారు కొందరు.
ధరలను బట్టి మందుల్లో తేడా..
మందుబాబులం.. మేము మందుబాబులం అంటూ మద్యం ప్రియుల్లో చాలామంది రోజు ఫుల్ గా మద్యం తాగేస్తుంటారు. ఎంత తాగినా కొందరు కంట్రోల్ లోనే ఉంటుండగా.. ఇంకొందరు మాత్రం కొంచెం తాగి నానా రభస చేస్తుంటారు. ఇదంతా ఆయా వ్యక్తుల బాడీ మీదనే కాదు.. వారు తాగే బ్రాండ్ మందుల్లో ఉండే ఆల్కహాల్ పర్సంటేజ్, దాని తయారీ, ధరల మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎవరైనా మందుకొట్టి రోడ్డుపై అటు ఇటూ తూలుతూ ఉంటే చీప్ లిక్కర్ తాగినట్టు. అందుకే అలా తూలుతున్నాడు అనడం కామన్ గా వింటూనే ఉంటాం. వాస్తవానికి తక్కువ ధరల మద్యంలో ఎక్కువ ఆల్కహాల్ పర్సంటేజ్ ఉంటుంది అంటున్నారు నిపుణులు. తయారీ విధానంలోనూ తేడాలుంటాయి. అందుకే చీప్ లిక్కర్ తాగితే బాగా కిక్కు ఎక్కడమే కాదు, అది కుదురుగా ఉండనివ్వదు అని చెబుతున్నారు. ఈ మద్యాన్ని సేవించడం వల్ల అనారోగ్యం బారినపడడం ఖాయమట, దీర్ఘకాలంలో పలు రోగాలు వస్తాయని అంటున్నారు.
ఎన్నెన్నో రకాలు..
మద్యం ప్రియులు ఒక్కోరు ఒక్కో బ్రాండ్ మద్యాన్ని ఎంచుకుంటారు. రెగ్యులర్ గా అదే తాగుతూ ఉంటారు. ఎప్పుడో ఓసారి, ఆ బ్రాండ్ దొరకక పోతే, తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బ్రాండ్ చేంజ్ అవుతుంది. లేదంటే మాత్రం ఒకే బ్రాండ్. మద్యంలోనూ బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, జీన్, వైన్ ఇలా అనేక రకాలున్నాయి. వాటి కాస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. తాగేది బీర్ అయినా అందులో పదుల రకాల కంపెనీలు, ఆల్కహాల్ పర్సంటేజ్ ల్లో తేడాలు ఉంటాయి. అలాగే రమ్, జీన్, విస్కీల్లోనూ ఆయా కంపెనీలు, బ్రాండ్స్ తేడాలున్నాయి. ఇవేగాక వైన్ లాంటి కాస్త సాఫ్ట్ డ్రింక్స్ అంటే ఆల్కహాల్ శాతం చాలా తక్కువ మొత్తంలో ఉన్నవి కూడా ధరల్లో తేడాలుంటాయి. అలాగే మద్యం తయారీ సంవత్సరాన్ని బట్టి, అది నిలువ ఉన్న రోజులను బట్టి కూడా ధరలు మారిపోతూ ఉంటాయి. అదే సంవత్సరం తయారైన మద్యానికి తక్కువ ధర పలికితే, సంవత్సరాలు పెరిగిన కొద్దీ ధరలు సైతం అమాంతం పెరుగుతూ ఉంటాయి. వీటి ఎంపిక విషయంల్లో ఒక్కోరిది ఒక్కో టేస్ట్. ముందే చెప్పినట్టు ఎవరికి నచ్చింది వారు తాగేస్తుంటారు.
ఈ మద్యం మహా కాస్ట్..
మందుబాబుల్లో చాలామందికి చీప్ లిక్కర్ నుండి మొదలు సిగ్నీచర్స్, టీచర్స్, బ్లాక్ డాగ్ మందుల వరకు తెలుసు. కానీ అంతకు మించిన మందులు అదే మద్యం కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మన మహానగర జనాలకు. కొన్ని మాల్స్ లో ఏర్పాటు చేసిన వైన్స్ షాపుల్లో అత్యధిక ధరకు అమ్ముడు పోయే మందులున్నాయి. వాటిలో చివాస్ రీగల్ 25 సంవత్సరాల ఓల్డ్ వెర్షన్ 700 ఎంఎల్ విస్కీ ధర జస్ట్ రూ.32వేల 865 మాత్రమే. అవునూ మీరు చదివింది నిజమే… అక్షరాల ముప్పై రెండు వేల ఎనిమిది వందల, అరవై ఐదు రూపాయలు. అదీ జస్ట్ 700 మిల్లీ లీటర్ల మందు ధర. అలాగే మరో బ్రాండ్.. జానీ వాకర్ బ్లూ లేబుల్ స్కాచ్ 750 ఎంఎల్ ధర రూ.23 వేల 40 ఉంది. ది గ్లిన్ లై వెట్ సింగిల్ మాల్ట్ 21 సంవత్సరాల ఓల్డ్ స్కాచ్ ధర రూ. 25వేల 250 మాత్రమే. గ్లెన్ ఫీడిచ్ 18 సంవత్సరాల ఓల్డ్ స్కాచ్ ధర రూ.11వేల 810గా ఉంది. ఇలా బ్రాండ్, ఇయర్ ను బట్టి ధరల్లో తేడాలున్నాయి. అలాగే ఆస్ట్రేలియా, అమెరికా, రష్యా తదితర దేశాల నుండి ఇంపోర్ట్ అయిన వైన్, బీర్లకు కూడా ఫుల్ డిమాండ్ ఉంది. ధరలకు ఏమాత్రం వెనకాడకుండా మద్యం ప్రియులు తమకు నచ్చిన బ్రాండ్స్ ను కొనుగోలు చేస్తున్నారు. హాయిగా తాగేస్తున్నారు.
కలకలాడుతున్న మాల్స్..
మందుబాబులతో మద్యం షాప్స్ కలకలలాడుతున్నాయి. ఉదయం నుండి రాత్రి వరకు ఫుల్ గిరాకీలు ఉంటున్నాయి. వేసవికాలం రావడంతో బీర్లకు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు. ఇంపోర్టెడ్ వైన్స్, స్కాచ్, విస్కీల ధరలతో సంబంధం లేకుండా వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారని తెలిపారు ఓ మాల్ లోని వైన్ స్టోర్ మేనేజర్.