- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోరాడి గెలిచిన మహిళాలోకం.. చరిత్రను తిరగరాసిన లిప్‌స్టిక్ వార్
దిశ, ఫీచర్స్: లిప్‌స్టిక్.. అమెరికా చరిత్రను తిరగరాసింది. మహిళా హక్కుల పోరాటానికి వేదికగా నిలిచింది. ఒక చిన్నారి మొదలెట్టిన లిప్‌స్టిక్ వార్.. యూఎస్ మహిళలకు స్వేచ్ఛను ప్రసాదించి రాజకీయ రుగ్మతను వ్యతిరేకించింది. స్త్రీ శక్తిని తక్కువ అంచనా వేసే సంఘాలకు బుద్ధి చెప్పింది. లోదుస్తుల బిగుతులో సమసిపోయే బతుకులకు కంఫర్టబుల్ లైఫ్‌ను ఇచ్చింది. ఉమెన్ రైట్ టు బ్యూటీకి అంకురార్పణ చేసి.. పెయింటెడ్ లిప్స్ పాయిజనస్ కాదని నిరూపించింది. ఫ్లాపర్స్‌ను బెస్ట్ కస్టమర్స్‌గా మార్చేసి.. వాణిజ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. లిప్‌స్టిక్ వార్ జరిగి ఈ నాటికి సరిగ్గా శతాబ్దం కాగా.. ఆ కల్చరల్ బ్యాటిల్ ఫీల్డ్ డిటెయిల్స్ మీకోసం.
లిప్‌స్టిక్ యుద్ధానికి నాంది..
1921, యూఎస్‌లో పర్ల్ పగ్స్‌లీ అనే అమ్మాయి లిప్‌స్టిక్ ధరించి స్కూల్‌కు వెళ్లగా.. అది తప్పంటూ బయటకు పంపించేశారు టీచర్లు. ఇంటికెళ్లిన పర్ల్ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయాన్ని అర్థంచేసుకున్న వారు.. సదరు స్కూల్ పిల్లల హక్కులను హరించిందంటూ కోర్టుకు వెళ్లారు. ఒక లాయర్‌ను అపాయింట్ చేసుకుని లిప్‌స్టిక్ వేసుకుంటే తప్పు ఎలా అవుతుందనే వాదనను వినిపించారు. నేషనల్ వైడ్ మీడియా ఈ న్యూస్‌ను కవర్ చేయడంతో టాక్ ఆఫ్ ది నేషన్ అయిపోయింది. అదే సమయంలో లాస్ ఏంజిల్స్ మోషన్స్ పిక్చర్ పాపకు వారానికి వేయి డాలర్లు చెల్లించి సినిమా తీసేందుకు ముందుకొచ్చింది.
పిటిషన్ కొట్టేసిన సుప్రీం..
ఎగ్జాక్ట్‌గా వందేళ్ల కిందట ప్రారంభమైన ఈ లిప్ స్టిక్ వార్.. ఒక చిన్న పిల్ల నుంచి మొదలై నేషన్ వైడ్ అటెన్షన్ క్యాచ్ చేసింది. రాజకీయ, సామాజిక చిక్కులు కలిగిన లిప్‌స్టిక్ వేరింగ్.. ఉమెన్ రైట్స్, ఉమెన్ డిగ్నిటీ గురించి చర్చించేందుకు వేదిగా మారింది. అయితే ఈ ఇష్యూపై కేసు వేయడం వెనుక తనకు ఎలాంటి దురుద్దేశం లేదని.. మహిళలు తమకు నచ్చిన విధంగా, బెస్ట్‌గా కనిపించే హక్కు వారికి ఉందని చెప్పడమే తన అభిప్రాయమని.. దీనిపై న్యాయపోరాటం చేస్తానని చెప్పింది పర్ల్. కానీ ఈ కేసును చాలా సింపుల్‌గా తీసుకున్న స్టేట్ సుప్రీం కోర్టు.. ఎలాంటి జ్ఞానం లేని పబ్లిక్ స్కూల్ పిల్లలు వేసే పిటిషన్‌పై విచారించి తమ టైమ్ వేస్ట్ చేసుకోలేమని, ఇంకా చాలా ముఖ్యమైన విషయాలపై కాన్సంట్రేట్ చేయాల్సి ఉందని కొట్టిపారేసింది.
Right to vote – Right to Beauty
అయితే రెండేళ్ల తర్వాత మహిళలకు ఓటు హక్కు కల్పిస్తూ యూఎస్ 19వ సవరణ బిల్లు పాస్ చేసింది. ఈ టైమ్‌లో స్త్రీల కుతంత్రాలు రాజకీయాలపై మితిమీరిన ప్రభావం చూపగలవని ‘ది ఆర్కాన్సాస్ డెమొక్రాట్’ ఎడిటోరియల్ పేజీ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలకు జాతీయ హక్కు కల్పించడం వల్ల ఓటు వేసేందుకు కుట్లు, అల్లికలు, లిప్ స్టిక్, సైడ్ గ్లాన్స్, పట్టు బట్టలు లాంటి విషయాలపై ఆధారపడి ఓటు వేస్తారా? లేదా ఈ విజయంతో రాజకీయ చైతన్యం పొంది నేతలుగా మారి ఓటు వేయించుకుంటారా? అనే విషయంపై నెగెటివ్ స్టోరీ ప్రచురించింది. ఇది కాస్తా ‘ఉమెన్ రైట్ టు బ్యూటీ’ తో పాటు లిప్ స్టిక్ వేరింగ్‌పై మళ్లీ చర్చకు దారితీసింది.
ఫ్లాపర్స్ వాంట్స్ ఫ్రీడమ్..
యునైటెడ్ స్టేట్స్‌లో ఆల్కహాల్‌ను బహిష్కరిస్తూ 18వ సవరణ బిల్లు ఆమోదం పొందినపుడు సంబరాలు జరుపుకున్నారు. అయితే ఈ బ్యాన్‌ను ఆల్కహాల్‌కు మాత్రమే పరిమితం చేయకుండా సౌందర్య సాధనాలను కూడా వర్తింపచేయాలని ఉమెన్స్ క్రిస్టియన్ టెంపరెన్స్ యూనియన్ (WCTU) పోరాటాన్ని ప్రారంభించింది. శాన్ ఫ్రాన్సిస్కోలో 1921న జరిగిన నేషనల్ మీటింగ్ నందు అమెరికాలో పెయింటెడ్ లిప్స్‌కు ఆస్కారం లేదని ప్రకటించింది. లిప్‌స్టిక్‌ను ఎంచుకునే స్త్రీలు ఓ మూర్ఖపు మార్గంలో ఉన్నారని, క్రిస్టియానిటీ బోధనలు వినే స్టేజీలో లేరని విమర్శించింది. ఈ స్టేట్‌మెంట్‌తో ఇండిపెండెంట్ అమెరికన్ ఉమెన్ ఫస్ట్ జనరేషన్‌గా పిలువబడే ఫ్లాపర్స్.. WCTU స్టేట్‌మెంట్‌ను సవాల్ చేస్తూ లిప్ట్‌స్టిక్ ధరించి ఓ పొలిటికల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాదు సుప్రీంకోర్టులో న్యాయం పొందని చిన్నారి పర్ల్‌కు సపోర్ట్‌గా పెటికోట్స్, ఫిట్‌గా ఉండే లోదుస్తులు ధరించడాన్ని వ్యతిరేకించిన ఈ యంగ్ ఉమెన్.. కంఫర్టబుల్, ఫ్లెక్సిబుల్ అండర్‌గార్మెంట్స్ వేసుకునేందుకు శ్రీకారం చుట్టారు. అమ్మాయిలు పొడుగుజుట్టుతోనే ఎందుకుండాలి? బాయ్స్ మాదిరిగా షార్ట్ హెయిర్ ఎందుకు ఉండకూడదని ప్రశ్నిస్తూ.. షార్ట్ హెయిర్‌తో ప్రదర్శనలు ఇచ్చారు. లిపిస్టిక్ ధరించడంపై ఎవరెన్ని కామెంట్స్ చేసినా యాక్సెప్ట్ చేసేందుకు ముందున్నారు. ‘గతంలో నిరాడంబరులైన యువతులు ఆక్రమించిన స్థలంలో లిప్‌స్టిక్ రాణులు కూర్చోవడం చూసి సంప్రదాయవాదులు విస్తుపోయారు’. ‘విస్తృతమైన అలంకరణ, బట్టలు, బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ క్యారేజ్‌తో కూడిన ఫ్లాపర్‌ను దేశ నైతికతకు ముప్పుగా అణచివేయాలా? లేదా కళ, అందాన్ని సెలబ్రేట్ చేసుకుంటారా?’ అని ట్రెడిషనలిస్ట్‌లు తమ కాలమ్స్‌లో రాసుకొచ్చారు.
వాణిజ్య రంగంలో విప్లవం..
ఫ్లాపర్స్ నైతికత గురించి ఎవరు ఏమనుకున్నా సరే.. మంచి కస్టమర్లుగా మాత్రం మిగిలిపోయారు. లిప్‌స్టిక్ వార్ నేపథ్యంలో U.S. ట్రెజరీ డేటా ప్రకారం.. అమెరికన్ మహిళలు లిప్‌స్టిక్ అండ్ కాస్మోటిక్స్ ప్రొడక్ట్స్‌పై 750 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అది నేడు 11 బిలియన్ డాలర్లకు సమానం కాగా.. వాణిజ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైంది. అయితే విమర్శకులు దీనిపై చాలా కామెంట్స్ చేశారు. ‘ప్రతీ నాలుగేళ్లకు తమ ఎత్తుకు సమానమైన లిప్‌స్టిక్ తింటారేమో’ అని మహిళలను తిట్టిపోస్తూ అయోవా పత్రిక ఒక వార్తను ప్రచురిస్తే.. ‘50 కోట్ల పెయింటెడ్ లిప్స్ ఇతరులను కిస్ చేస్తున్నాయి. ఎవరికి పాయిజన్ కాలేదుగా మరి’ అని మరొక పేపర్ నివేదించింది.
సెలబ్రిటీ వార్..
లిప్‌స్టిక్ వార్‌లో పాల్గొన్న సెలబ్రిటీల్లో ఒకరు రూత్ ఎల్డర్. అట్లాంటిక్ దాటిన మొదటి మహిళా పైలట్‌గా ప్రకటించుకున్న ఆమె.. విమానంలో అమెరికన్ గర్ల్ అని పేరు పెట్టుకుంది. 1927లో చార్లెస్ లిండ్‌బర్గ్ చారిత్రాత్మక విమానం నుంచి ప్రేరణ పొందిన తను సినిమాల్లోకి ప్రవేశించేందుకు ట్రై చేసింది. అయితే తను ఆకాశంలో ఎగిరేటపుడు ఫ్లయింగ్ సూట్‌తో పాటు రెండు డ్రెస్సులు, పౌడర్ పఫ్ సహా లిప్‌స్టిక్ కూడా తీసుకెళ్తానని ప్రకటించింది. దీంతో తనపై మీడియా స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టింది. తన బ్యూటీ కేర్ గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇచ్చింది. 1927 అక్టోబర్ 12న కో పైలట్ ‘జార్జ్ హల్డ్‌మన్’తో టేకాఫ్ అయిన తన గురించి ‘ఫ్లాపర్ వింగ్స్ ఫర్ పారిస్’ అంటూ న్యూయార్క్ డైలీ న్యూస్ గొప్పగా అనౌన్స్ చేసింది. కానీ దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో తను ప్రాణాలతో బయటపడినా.. అట్లాంటిక్ దాటిన మొదటి మహిళా పైలట్‌గా రికార్డ్ సృష్టించలేకపోయింది. ఆ తర్వాత ఏడాది అమేలియా ఇయర్‌హార్ట్ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
ఏదేమైనా మిస్ అమెరికా ఆఫ్ ఏవియేషన్‌గా నిలిచిపోయిన రూత్ ఎల్డర్.. ఫెమినిజానికి సంబంధించిన దీర్ఘకాల అంచనాలకు వ్యతిరేకంగా స్వేచ్ఛను సమతుల్యం చేసేందుకు ప్రయత్నించిన యుగానికి తనొక ప్రతీకగా మారింది. ‘ఫేమస్ సెలబ్రిటీలైనా, కాకపోయినా.. పోరాడేందుకు ప్రయత్నించండి. మీ లిప్‌స్టిక్ ఉందని ఖచ్చితంగా నిర్ధారించుకోండి. అప్పుడే మీరు పూర్తి హక్కులను పొందగలుగుతారు’ అని పిలుపునిచ్చింది.