ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు లైన్ క్లీయర్

by Shyam |
food processing units
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు లైన్ క్లియర్ అయింది. వేరుశనగ ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ఆర్థిక సహకారాలు అందిస్తామని కెనరాబ్యాంక్ ప్రతినిధులు తెలిపారు. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలో కెనరా బ్యాంక్ జీఎం కేహెచ్ పట్నాయక్ మంత్రి నిరంజన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను అందిస్తే ఎన్ని యూనిట్లకైనా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. ఆర్థిక సహకారానికి ముందుకు వచ్చినందుకు కెనరా బ్యాంక్ ప్రతినిధులుకు మంత్రి నిరంజన్ రెడ్డి కృతజ్ణతలు తెలిపారు. రైతులు వేరుశనగను సాగు చేసేలా ప్రోత్సహిస్తామన్నారు.

Advertisement

Next Story