- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైట్ పాయిజన్.. లిస్ట్‌లో రిఫైన్డ్ షుగర్, సాల్ట్, బియ్యం, పిండి
దిశ, ఫీచర్స్: మీరు రోజు ‘వైట్ పాయిజన్’ తీసుకుంటున్నారని తెలుసా? మీ ఆహారంలో కచ్చితంగా విషం ఉంటుందంటే నమ్మలేకపోతున్నారా? కానీ నమ్మితీరాల్సిందే అంటున్నారు నిపుణులు. శుద్ధిచేసిన చక్కెర, ఉప్పు, బ్రెడ్-బిస్కెట్‌ను తయారు చేసే పిండి, బియ్యం ఈ లిస్ట్‌లో ఉండగా.. అసలు వీటిని విషం అని ఎందుకు పిలుస్తున్నారు? అనే విషయంపై వివరణ ఇస్తున్నారు నిపుణులు.
వైట్ పాయిజన్ అంటే..?
‘వైట్ పాయిజన్’ అనేది రిఫైన్డ్ షుగర్, ఇతర హై-గ్లైసెమిక్ ఇండెక్స్ కార్బోహైడ్రేట్‌లను ప్రత్యేకంగా వర్ణించడానికి ఉపయోగించే పదం. కేకులు, పేస్ట్రీలు, శీతల పానీయాల వంటి అనేక ఆహారాలలో కనిపించే వీటిని అధికంగా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా శుద్ధి చేసిన చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను త్వరగా పెంచుతుంది. శరీరంపై ప్రతికూల ప్రభావాన్ని చూపే ఇన్సులిన్ స్పైక్‌కు దారితీస్తుంది. అధికంగా ఉప్పు వినియోగం అధిక రక్తపోటుకు దారితీస్తుంది. హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలలో అధిక స్థాయిలో ఉప్పు ఉంటుండగా వాటిని పూర్తిగా అవాయిడ్ చేయాలని.. వంట సమయంలో ఆహారంలో ఉప్పు ఎంత మోతాదులో వాడుతున్నారో పర్యవేక్షించాలని సూచిస్తున్నారు.
ఇక బియ్యం.. ముఖ్యంగా శుద్ధి చేసిన తెల్ల బియ్యం కూడా తెల్లటి విషంగా పరిగణించబడుతుంది. తక్కువ పోషక విలువలను కలిగిన పిండి.. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అధిక బరువుతోపాటు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ప్రత్యేకంగా ప్రాసెస్ చేయబడిన పాలు కూడా వైట్ పాయిజన్‌గా పరిగణించబడుతున్నాయి. వీటిలో అదనపు చక్కెరలు, హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఉండవచ్చు. అజీర్తి, ఇతర సంబంధిత సమస్యలను కలిగించవచ్చు.
వినియోగించడం మానేయాలా?
ఈ ఆహారాలను పూర్తిగా నివారించాల్సిన అవసరం లేనప్పటికీ.. చక్కెర, ఉప్పు, బియ్యం, పిండి వినియోగం పరిమాణంపై శ్రద్ధ వహించడం మంచిది అంటున్నారు నిపుణులు. నిజానికి ఇవి ‘విషం’ కాదు. కానీ ఒక్కసారి ఎక్కువగా తీసుకుంటే టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం, హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తాయి. శరీరంలో మంటను కలిగిస్తాయి. కాబట్టి భోజనంలో వీటి పరిమాణం విషయంలో జాగ్రత్త వహించాలి. దుష్ప్రభావాలను తగ్గించడానికి కనీసం కొంతకాలంపాటు కఠినంగా దూరం పెట్టే ప్రయత్నం చేయాలి.
శుద్ధి చేసిన పిండికి బదులుగా బ్రౌన్ రైస్, గోధుమ పిండి, తక్కువ సోడియం ఆధారిత ఆహారాలు, తక్కువ కొవ్వు పాలు లేదా సేంద్రీయ పాలు వంటి కార్బోహైడ్రేట్‌లను ఎంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ప్రాసెస్ చేయబడిన, శుద్ధి చేసిన ఆహారాలను నివారించడం, ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలతో ప్రతికూల ప్రభావాల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. ఏదైనా మితంగా తీసుకోవడం, సమతుల్య మరియు వైవిధ్యమైన ఆహారాన్ని నిర్వహించడం చాలా అవసరం. చక్కెర పానీయాలకు బదులు నీరు తీసుకోవడం, భోజనంలో ఎక్కువ కూరగాయలను జోడించడం వంటి చిన్న మార్పులు చేయడం వల్ల వైట్ పాయిజన్ తీసుకోవడం తగ్గుతుంది.
టిప్స్ ..
* వారానికి మూడు సార్లు మిల్లెట్ పిండితో ఆల్-పర్పస్ పిండిని రీప్లేస్ చేయండి.
* సలాడ్‌లు, సూప్‌లుగా కూరగాయలు, మొలకలు, మజ్జిగ, పెరుగు వంటి సాధారణ ప్రోటీన్ మూలాలు మీ ప్లేట్‌లోని వైట్ పాయిజన్ మొత్తాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. తద్వారా నిష్పత్తి మెరుగుపడుతుంది. అజీర్ణం, షుగర్ స్పైక్, క్రాష్‌లాంటి ఎఫెక్ట్స్ ఉండవు.
* డీహైడ్రేషన్.. ఫాల్స్ హంగర్‌ను పెంచుతుంది. వైట్ పాయిజన్ అధికంగా తీసుకునేలా చేస్తుంది. కావున బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచే ప్రయత్నం చేయండి.
* అధిక ఒత్తిడి స్థాయిలు ఎక్కువ తెల్లటి విషం తీసుకునేలా ప్రేరేపిస్తుంది. కాబట్టి కూల్‌గా ఉండేందుకు ప్రయత్నించండి.
ఇవి కూడా చదవండి: