Xiaomi : క్షణానికో స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్న రోబో..

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-13 07:50:42.0  )
Xiaomi  : క్షణానికో స్మార్ట్ ఫోన్ తయారు చేస్తున్న రోబో..
X

దిశ, ఫీచర్స్: చైనీస్ టెక్ దిగ్గజం Xiaomi పూర్తిగా ఆటోమేటెడ్ స్మార్ట్ ఫ్యాక్టరీని ప్రారంభించింది,సెకన్ కు ఒక స్మార్ట్ ఫోన్ తయారు చేసే ఫీచర్స్ తో దూసుకెళ్తుంది. అంటే ఏటా 10 మిలియన్ స్మార్ట్ ఫోన్స్ ప్రొడ్యూస్ చేయగలదు. బీజింగ్‌లోని చాంగ్‌పింగ్ జిల్లాలో ఉన్న ఈ ఫ్యాక్టరీ మనుషుల అవసరం లేకుండా 24/7 పని చేస్తుండగా.. ఉత్పత్తి సమస్యలను గుర్తించి, సరిదిద్దగల ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ తో ఆపరేట్ చేయబడుతుంది. కాగా CEO లీ జున్ దీన్ని రియల్ ఆటోమేటెడ్ మాస్-ప్రొడక్షన్ ఫ్యాక్టరీగా అభివర్ణించారు. కంపెనీ నుంచి రాబోయే MIX ఫోల్డ్ 4, MIX ఫ్లిప్ ఫోన్‌లను అట్రాక్టింగ్ గా ఉత్పత్తి చేస్తుందని చెప్పారు.

అధునాతన పర్యవేక్షణ

ఈ Xiaomi హైపర్ ఇంటెలిజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాట్‌ఫారమ్ (IMP) మనుషుల ప్రెజెన్స్ లేకుండానే ఆపరేట్ చేయబడుతుంది. రా మెటీరియల్స్ నుంచి డెలివరీ వరకు జరిగే ప్రక్రియ ఆటోమేటక్ గా జరిగిపోతుంది. కానీ కొంతమంది వ్యక్తులు మాత్రం మానిటర్ చేస్తారని తెలిపిన జున్.. దీన్ని వార్ రూమ్ గా సూచించారు. IMP ప్రాసెస్ ఫ్లో మెరుగుపరిచేందుకు, నిర్ణయాలు తీసుకునేందుకు, ఆదేశాలను అమలు చేసేందుకు రూపొందించబడింది.

పరిశ్రమ మార్పు

ఆటోమేషన్ ట్రెండ్ ఇప్పటికే ప్రారంభం అయింది కానీ Xiaomi దీన్ని మరో లెవల్ కు తీసుకెళ్ళింది. మనుషుల ప్లేస్ లో రోబోలను తీసుకోవడం కొత్తేమీ కాదు. 2016లో ఫాక్స్‌కాన్ తన వర్క్‌ఫోర్స్‌ను 60,000 మందిని ట్రిమ్ చేసి.. రౌండ్-ది-క్లాక్ పని చేసే రోబోలను సెట్ చేసుకుంది. ప్రస్తుతం Xiaomi ఫుల్ ఆటోమేటెడ్ చేయగా.. అమెజాన్ కూడా ఈ పద్ధతిని ఫాలో కాబోతుంది.

Advertisement

Next Story

Most Viewed