వధూవరులకు వాతలు.. తరువాతే పెళ్లి తంతు.. ఎక్కడో తెలుసా..

by Sumithra |
వధూవరులకు వాతలు.. తరువాతే పెళ్లి తంతు.. ఎక్కడో తెలుసా..
X

దిశ, ఫీచర్స్ : వివాహం అనేది ప్రతి మనిషి జీవితంలో ఓ పెద్ద పండుగ లాంటిది. ఒక్కో దేశంలో, ఒక్కో రాష్ట్రంలో వారి వారి ఆచార వ్యవహారాలతో వివాహ వేడుకలు జరుగుతుంటాయి. ఈ ఆచారాల్లో కూడా కొన్ని వింత ఆచారాలు ఔరా అనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోని ఆచారాలు ఫన్నీగా ఉంటే మరికొన్ని భయంకరంగా ఉంటాయి. ఇంతకీ ఆ వింత ఆచారాలు ఏంటో ఎవరికైనా తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం..

పారిపోయి పెళ్లి చేసుకోవడం..

స్కాట్లాండ్‌లోని గ్రెట్నా గ్రీన్, ఇంగ్లండ్‌లలో కొన్ని వింత ఆచారాలు ఉన్నాయి. ఆ దేశాల్లో పెళ్లి చేసుకోవాలనుకునే 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తమకు నచ్చిన వారితో పారిపోయి వివాహం చేసుకోవచ్చు. వారివారి కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకోవలసిన అవసరం లేదట.

వధువు పై ఉమ్మివేయడం

కెన్యాలోని మాసాయి తెగలో ఓ వింత ఆచారం ఉంది. వివాహం అనంతరం వధువు తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్లే ముందు వధువు తండ్రి తన కుమార్తె తల మీద, రొమ్ముల పై ​​ఉమ్మి వేస్తాడట. అంతే కాదు వధువు అత్తారింటికి వెళ్లేటప్పుడు వెనక్కి తిరిగి చూస్తే రాయిగా మారుతుందని వెనక్కి తిరిగి చూడనివ్వరట. ఈ ఆచారాలు వింటుంటే వింతగా ఉన్నాయి కదా..

చీపురు మీద దూకుడు

వధూవరులు చీపురు దూకుడు ఆచారం అమెరికన్ సౌత్ నుండి వచ్చింది. నల్లజాతియులు బానిసత్వంలో మగ్గుతున్న సమయంలో ఈ ఆచారం వెలుగులోకి వచ్చిందట. ఆ రోజుల్లో నవదంపతులు కొత్త జీవితంలో ముందుకు సాగడాన్ని సూచిస్తూ చీపురు దూకాల్సి వచ్చేదట. ప్రస్తుతం ఈ సాంప్రదాయాన్ని కొంత మంది మాత్రమే పాటిస్తున్నారు.

వధూవరులను కాల్చే పద్ధతి..

వధూవరులకు వాతలు పెట్టి తరువాత పెళ్లి తంతు జరిపించే వింత ఆచారం ఉయ్ఘర్‌లు (చైనీస్ మైనారిటీ) లో ఉంది. పెళ్ళి ముహూర్తానికి ముందు వధూవరులను మొద్దుబారిన బాణంతో మూడుసార్లు కాలుస్తారట. ఆ తరువాత వరుడు బాణాలను తీసుకుని విచ్ఛిన్నం చేయాలట.

విచిత్రమైన మొదటి రాత్రి

వివాహం అనంతరం కొత్త జంటతో పాటు మొదటి రాత్రి గదిలోకి మరో వ్యక్తి వెళ్లే వింత ఆచారం ఆఫ్రికా లోని కొన్ని గ్రామాల్లో కొనసాగుతుంది. మొదటి రాత్రి రోజు వధువు తన భర్తతో శృంగారం ఎలా చేయాలో నేర్పడానికి ఈ ఆచారం కొనసాగిస్తారట. అయితే గదిలోకి ఎవరైనా వృద్ధురాలు లేక వధువు తల్లి వెళ్లొచ్చంట.

ఈ వింత ఆచారాల గురించి వింటుంటేనే మతి పోతుంది కదా... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ఆచారాలు కొనసాగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో కాలానుగుణంగా చెక్ పెట్టేశారు.

Advertisement

Next Story

Most Viewed