- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శరీరంలో ఆ మార్పులు కనిపిస్తున్నాయా?.. అయితే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
దిశ, ఫీచర్స్: సాధారణంగా 40 ఏళ్లు దాటిన మహిళల శరీరంలో పలు మార్పులు వస్తుంటాయి. పొత్తికడుపులో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, వెయిట్ పెరగడం, డయాబెటిస్ బారిన పడటం జరుగుతుంది. ప్రీ మెనోపాజ్ దశలో మూడ్ స్వింగ్‌లు, హాట్ ఫ్లాషెస్ వంటి సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. చాలా వరకు ఈస్ట్రోజెన్ లెవల్స్ తగ్గడంవల్ల ఇన్సులిన్‌తో పాటు బ్లడ్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే హార్మోన్ కూడా తగ్గుతుంది.
ఇటువంటి సమస్యలను ఎదుర్కోవాలంటే హెల్తీ లైఫ్ స్టయిల్‌ను అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. అందులో భాగంగా శరీరానికి అవసరమైన విటమిన్లు, ఇతర పోషకాలు తీసుకోవాలని, వీటివల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుందని చెప్తున్నారు. అలాగే డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, హార్ట్ ఎటాక్స్ వంటి క్రానిక్ డిసీజెస్‌కు దూరంగా ఉండవచ్చు. ప్రీ మెనోపాజ్ సిమ్టమ్స్ నుంచి ఉపశమనం పొందవచ్చు. హెల్తీ ఫుడ్‌తో ఎక్సర్‌సైజ్ కూడా దినచర్యలో భాగమైతే 40 ఏండ్లు దాటాక తలెత్తే అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అందుకోసం తీసుకోవాల్సిన మినరల్స్, విటమిన్లు ఏవో తెలుసుకుందాం.
ప్రోటీన్లు, విటమిన్ బి
మహిళల్లో విటమిన్లు, ప్రోటీన్లు లోపిస్తే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బాడీ మాస్ ఇండెక్స్ మెయింటెనెన్స్ అదుపు తప్పుతుంది. కండరాల పటుత్వం కోల్పోతారు. ఎక్కువరోజులు ప్రోటీన్ల లోపం కొనసాగడం దీర్ఘకాలం జీవించే అవకాశాన్ని తగ్గిస్తుంది. అందుకే తగినంతగా తీసుకోవాలి. పాలు, కోడిగుడ్లు, పప్పు దినుసుల్లో ఇవి లభిస్తాయి. డైటీషియన్ల సూచన మేరకు ప్రోటీన్ల లోపాన్ని నివారించే సప్లిమెంట్స్ వాడవచ్చు. అలాగే 40 ఏళ్లు పైడిన మహిళలకు విటమిన్ బి కాంప్లెక్స్ చాలా అవసరం. ఎందుకంటే ఇందులో అంతర్భాగమైన ఫోలిక్ యాసిడ్ శరీరంలోని హార్మోన్ల సమతుల్యతకు సహాయపడుతుంది. దీనివల్ల రోగాల బారిన పడకుండా ఉంటారు. ఎముకలు పెళుసుబారకుండా ఉండాలంటే విటమిన్ బి12, థయామిన్, నియాసిన్, రైబోఫ్లోవిన్ కూడా ముఖ్యం.
కాల్షియం, విటమిన్ డి
మహిళలు మాతృత్వ దశలో పిల్లలకు పాలు ఇస్తుంటారు. శరీరంలోని ఎముకల్లో క్యాల్షియం సమృద్దిగా ఉన్నప్పుడే తగినంతగా పాలు ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే ఏజ్ బార్ అవుతున్న కొద్దీ నడుములు వంగిపోకుండా, మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కూడా కాల్షియం అవసరం. కాబట్టి తీసుకునే ఆహారంలో కాల్షియం సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. ఇది లోపిస్తే ఆస్టియోపోరోసిస్ అనే ఎముకల వ్యాధి వస్తుంది.
అందుకే క్యాల్షియం పుష్కలంగా ఉండే పాలు, ఆకు కూరలు, ఇతర ఆహారాలు తీసుకోవాలి. వీటితోపాటు కాల్షియాన్ని గ్రహించగలిగే విటమిన్ డి శరీరానికి చాలా ముఖ్యం. ఇది కాల్షియం శరీరంలో ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోకుండా సహాయపడుతుంది. ఇది సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయంపూట ఎండలో కాసేపు నిలబడితే మంచిది. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్ పుష్కలంగా లభించే ఆహారాలు తీసుకోవాలి.
Also Read..
సోషల్ మీడియా ట్రెండింగ్ చిట్కాలు.. ఆ 5 నిజంగానే పనిచేస్తాయట!