- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళలు.. సరైనది ఎంచుకోండి..!
దిశ, ఫీచర్స్: రోజు రోజుకి మార్కెట్‌లో కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అయితే, ఎన్ని ఉన్నా సరే ఈ ఫ్యాషన్ ప్రపంచంలో చీరకి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది. ఎన్ని రకాల దుస్తులు వచ్చినా మహిళలు చీరకే మొదటి ప్రాధాన్యతను ఇస్తారు. అయితే, చాలామంది మహిళలు కొత్త చీరలకు కూడా పాత పెట్టికోట్‌లను ఉపయోగిస్తారు. ఈ విషయంపై అంత శ్రద్ధ చూపరు. పాతది ఉంది కదా అని దాన్నే వాడేస్తుంటారు. అది సరైన పద్ధతి కాదని ఫ్యాషన్ నిపుణులు చెబుతున్నారు. చీరకట్టు అందంగా కనిపించాలంటే దానికి ఎలాంటి పెట్టికోట్స్ ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మహిళలందరూ నచ్చిన చీర కోసం అన్నీ షాపులకు తిరుగుతుంటారు. చీర రంగు, నాణ్యత, డిజైన్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. కానీ, శారీ పెట్టికోట్స్ విషయంలో మాత్రం శ్రద్ధ చూపరు. చీర కట్టు అందంగా కనిపించాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్. చీర రంగులో ఉన్న పెట్టికోట్స్ వాడడం వల్ల చీర కట్టు చూడడానికి అందంగా కనిపిస్తుంది. చీరను బట్టి పెట్టికోట్‌ను ఎంచుకోవాలి. తేలికగా ఉంటే చీరలకు బరువుగా ఉండేవి.. బరువుగా ఉన్న చీరకు తేలికగా ఉండే వాటిని వాడాలి. షిపాన్, జార్జెట్, నెట్, కాటన్ వంటి చీరలను ఎంచుకున్నప్పుడు వాటి రంగున్న పెట్టికోట్ వాడడం వల్ల చీరలు అందంగా కనిపిస్తాయి.
కొందరు మహిళలు నెట్ శారీకి కాటన్ పట్టికోట్‌ను ఉపయోగిస్తారు. దీనికి కాటన్ కాకుండా శాటిన్, షిమ్మర్ రకం ఎంచుకోవడం మంచిది. శరీర ఆకృతిని, ఎత్తుకు సరిపోయే వాటిని మాత్రమే వాడాలి. పొడవాటి పెట్టికోట్స్ తీసుకోవడం కంటే కాలు మడిమలకు అంగుళం పైన ఉండే వాటిని తీసుకోవాలి. మీ ఎత్తుకంటే పొడవుగా ఉన్న వాటిని ఉంచుకోవడం వల్ల దాన్ని ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. దీన్ని వల్ల చీర కట్టు సరిగా ఉండదు. పాత పట్టికోట్స్ ఉన్నాయని కొత్త చీరకు ఉపయోగిస్తే, చీర కట్టు పద్ధతి మారిపోతుంది.
Read More...
Beauty tips: ఫేషియల్ చేయించుకున్న తరువాత ఈ తప్పులు చేయకండి..!