బాయ్ ఫ్రెండ్‌కు రోజుకి వంద కాల్స్ .. రోగమే అని నిర్ధారించిన వైద్యులు.. మీ పార్టనర్‌లోనూ ఈ లక్షణాలు ఉన్నాయా?

by Dishafeatures3 |
బాయ్ ఫ్రెండ్‌కు రోజుకి వంద కాల్స్ .. రోగమే అని నిర్ధారించిన వైద్యులు.. మీ పార్టనర్‌లోనూ ఈ లక్షణాలు ఉన్నాయా?
X

దిశ, ఫీచర్స్ : చైనాకు చెందిన 18ఏళ్ల Xiaoyu.. యూనివర్సిటీలో జాయిన్ అయింది. ఫస్ట్ ఇయర్ నుంచే ఓ అబ్బాయితో ప్రేమలో పడింది. చాలా పోసెసివ్ గా ఉండేది. ఆయన ప్రతి క్షణం ఏం చేస్తున్నాడో తెలుసుకునేందుకు ప్రయత్నించేది. ఈ బిహేవియర్ తో విసిగిపోయిన అబ్బాయి.. నరకం అనుభవించేవాడు. ఎంత చెప్పినా వినకపోయేసరికి తనను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. అయినా సరే ఆ అమ్మాయి కాల్స్ చేయడం, మేసేజ్ పెట్టడం చేస్తూనే ఉంది. ఓ రోజు ఏకంగా వంద కాల్స్ కు మించే చేసినా రెస్పాన్స్ రాకపోవడంతో పిచ్చిపట్టినట్టు ప్రవర్తించింది. ఇంట్లో వస్తువులన్నీ ఎత్తేయడం, పై నుంచి దూకేస్తానని బెదిరించడం చేసింది.

ఇక ఇవన్నీ తట్టుకోలేని అబ్బాయి లా ఎన్ ఫోర్స్ మెంట్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న అధికారులు అమ్మాయి పరిస్థితి చూసి హాస్పిటల్ తరలించగా.. ఆమెను పరీక్షించిన వైద్యులు బార్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. రొమాంటిక్ రిలేషన్ షిప్స్ లో ఇలాంటి సిచుయేషన్ తలెత్తుతుందని.. దీన్ని లవ్ బ్రెయిన్ గా పిలుస్తారని వివరించారు.



Next Story

Most Viewed