- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KING COBRA: పాములు ఒకదానినొకటి ఎందుకు తింటాయి?
దిశ, ఫీచర్స్ : ఈస్టర్న్ కింగ్ స్నేక్, కింగ్ కోబ్రా వంటి కొన్నిరకాల పాములకు ఓఫియోఫాగి అనే ఫీచర్ ఉంటుంది. దీనర్థం ఇతర స్నేక్స్ ను వేటాడి తిని మనుగడ సాధించడం. విషపూరితమైన వాటితో సహా ఇతర పాములను వేటాడతాయి.. దీనివల్ల పోటీ తగ్గుతుంది. స్థిరమైన ఆహార సరఫరా జరుగుతుంది. పాములు ఒత్తిడి లేదా ఆహార కొరతను ఎదుర్కొన్నప్పుడు .. ప్రత్యేకించి బందిఖానాలో ఉంచబడినప్పుడు నరమాంస భక్షణలో కూడా పాల్గొంటాయని చెప్తున్నాయి పలు అధ్యయనాలు. సరీసృపాలకు ఉన్న ప్రత్యేక మనుగడ వ్యూహాలను ప్రతిబింబించే ఈ ప్రవర్తన... ముఖ్యమైన పర్యావరణ, పరిణామ శాఖలను కలిగి ఉంది.
కింగ్ కోబ్రాస్ ప్రపంచంలోనే అతి పొడవైన విషపూరిత పాములు. కాగా పద్దెనిమిది అడుగుల పొడవు వరకు ఉంటాయి. భయంకరమైన మాంసాహారులుగా పిలవబడే ఈ పాములు... వాటి భారీ పరిమాణం, బలమైన విషం కారణంగా పెద్ద ఎరను కూడా మట్టుబెట్టగలవు. అందుకే జీవావరణ శాస్త్రం పాముల ఒఫియోఫాగి, నరమాంస భక్షక పద్ధతుల ద్వారా గణనీయంగా ప్రభావితమవుతాయి. ఓఫియోఫాగస్ జాతులు ఇతర పాములను ఆహారంగా తీసుకోవడం ద్వారా జనాభా నిర్వహణకు దోహదం చేస్తాయి. పర్యావరణ వ్యవస్థ సమతుల్యతను కాపాడతాయి. వనరుల కోసం పోటీని తగ్గించడం ద్వారా.. ప్రెడేటర్ స్నేక్ దాని సహజ నివాస స్థలంలో జీవించి, వృద్ధి చెందడానికి సహాయపడుతుంది. దీనివల్ల పాముల జనాభా తగ్గిపోయి.. మనుషులు, జంతువులకు విషపూరిత పాము కాటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది కింగ్ కోబ్రా.