- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీళ్లు మరీ తక్కువగా తాగుతున్నారా.. అయితే గ్లామర్, ఫిట్‌నెస్ కోల్పోవచ్చు..!
దిశ, ఫీచర్స్: ప్రతి ఒక్కరూ అందంగా ఫిట్‌నెస్‌గా ఉండాలని కోరుకుంటారు.అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతర ప్రయత్నాలేమోగానీ, రోజూ శరీరానికి అవసరమైనంత నీరు తాగాలని నిపుణులు చెప్తున్నారు. వయస్సు రీత్యా, లేదా వాతావరణ ప్రభావంతోనో నేడు ఫిట్‌నెస్ మెయింటెన్ చేయడం చాలా మందికి సమస్యగా మారుతోంది. ఉరుకులూ పరుగుల జీవితం, పనిలో నిమగ్నం కావడం వల్ల చాలా మంది దాహం వేసిన ప్రతిసారి నీరు తాగడం లేదు. ఈ కారణంగా ముఖ వర్ఛస్సు తగ్గడం, గ్లామర్ అండ్ ఫిట్ నెస్ కోల్పోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తడం జరుగుతోంది. కాబట్టి తగినంత నీటితోపాటు అవసరమైన వర్కవుట్స్ చేస్తూ ఉంటే ఫిట్‌నెస్ సమస్య రాదంటున్నారు నిపుణులు. శరీరంలో నీటి స్థాయి తగ్గడం వల్ల సహజంగానే ముఖ వర్ఛస్సు తగ్గుతుందని, అంద విహీనంగా కనిపిస్తుంటారని డెర్మటాలజిస్టులు చెప్తున్నారు. నీరు చాలా తక్కవుగా తాగేవారిలో వయస్సు మీద పడిన లక్షణాలు, ఛాయలు త్వరగా కనిపించే ఆస్కారం ఉందట. వీలైనంత మేరకు రోజులో ఎక్కువ సార్లు నీరు తాగడంతో ఏజ్ బార్ తలెత్తే ఇబ్బందులను దూరం అవుతాయి. ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు.