రాంగ్ పర్సన్‌ సిగ్నల్ అంటే ఏమిటి?.. సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది?

by Javid Pasha |
రాంగ్ పర్సన్‌ సిగ్నల్ అంటే ఏమిటి?.. సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది?
X

దిశ, ఫీచర్స్ : ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం ఏర్పడటానికి, ప్రేమ, ఆకర్షణ మొదటి మెట్టు కావచ్చు. కానీ జీవితాంతం కలిసి నడవాలంటే అవి మాత్రమే సరిపోవు. రిలేషన్‌షిప్ అనేది ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటూ, పరస్పరం అర్థం చేసుకుంటూ సాగే లాంగ్ జర్నీ వంటిది. డే ఆఫ్టర్ డే అట్రాక్షన్, ఓపెన్ కమ్యూనికేషన్, పర్సనల్ బౌండరీస్, పరస్పర గౌరవం, అవగాహన, కుటుంబ, ఆర్థిక విషయాలు వంటివన్నీ ఇక్కడ కీలక పాత్ర పోషిస్తాయి. కానీ కొందరు ఇవేవీ అర్థం చేసుకోకుండా కమిటైపోయి తర్వాత ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి బంధం టాక్సిక్ లేదా రాంగ్ పర్సన్ రిలేషన్ షిప్‌కు దారితీస్తుందని నిపుణులు చెప్తునారు. అయితే మీరు రాంగ్ పర్సన్‌తో రిలేషన్‌లో ఉన్నారని గుర్తించదగిన కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

కమ్యూనికేషన్ లోపాలు

ఆరోగ్యకరమైన, బలమైన సంబంధానికి కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇది రిలేషన్ షిప్‌కు పునాది లాంటిదని నిపుణులు అంటున్నారు. ఇద్దరు వ్యక్తులు అంటే స్త్రీ, పురుషుడు లైఫ్‌ లాంగ్ కలిసి జీవించే క్రమంలో పరస్పరం అర్థం చేసుకోకపోవడం, అపార్థం చేసుకోవడం, వాగ్వాదానికి, గొడవలకు దిగడం వంటివి జరుగుతున్నాయంటే ఇక్కడ కమ్యూనికేషన్ లోపం ఉందనే అర్థం. ఎవరో ఒకరు రాంగ్ పర్సన్ బిహేవియర్ కలిగి ఉండటంవల్ల ఇలా జరుగుతుంది. ఈ పరిస్థితి క్రమంగా టాక్సిక్ డైనమిక్‌ను క్రియేట్ చేసే చాన్స్ ఉంటుంది. కాబట్టి హెల్తీ రిలేషన్ షిప్‌ అండ్ రెస్పెక్ట్ ఫుల్ కన్‌స్ట్రక్టివ్ కమ్యూనికేషన్ అవసరం. ఇలా కమ్యూనికేట్ చేయడానికి లేదా వైరుధ్యాలను పరిష్కరించడానికి మీ ప్రయత్నాలు నిరంతరం విఫలం అవుతూ ఉంటే.. మీరు రాంగ్ పర్సన్‌తో రిలేషన్‌లో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు.

తప్పును దాచడానికి డామినేట్ చేయడం

భాగస్వాములు ఇద్దరూ తమ అభిప్రాయాలను నొక్కిచెప్పాలని లేదా ఆధిక్యతను ప్రదర్శించాలని నిరంతరం భావించడం, ప్రయత్నించడంవల్ల ఎవరో ఒకరు రాంగ్ పర్సన్ బిహేవియర్‌ను డెవలప్ చేస్తారు. ఈ పరిస్థితి కపుల్స్ మధ్య ఓపెన్ కమ్యూనికేషన్‌ను బలహీన పరుస్తుంది. ఫలితంగా పరస్పరం అర్థం చేసుకోవడం, సహకరించుకోవడానికి బందులు గొడవ పడటం స్టార్ట్ చేస్తారు. ఇద్దరి మధ్య మనస్పర్థం గొడవ, ఆధిపత్యం చలాయించడంలో పోటీ వాతావణాన్ని క్రియేట్ చేస్తాయి. ఈ సందర్భంలో తప్పు చేసిన వ్యక్తి కూడా ఎక్కడా తగ్గకపోగా, ఆ తప్పును కప్పి పుచ్చడానికి మరింత డామినేట్ చేస్తుంటాడు. అంటే ఈ వ్యక్తిలోని లక్షణాలన్నీ రాంగ్ పర్సన్ సంకేతాలుగా పేర్కొనవచ్చు. ఒక వ్యక్తి తన పార్ట్‌నర్‌పై లేదా తను ఇష్టపడే వ్యక్తిపై ఆధిపత్యం చలాయిస్తూ తనకు అనుకూలంగా మల్చుకోవాలనే కోరికవల్ల ఈ విధమైన బిహేవియర్ ఏర్పడుతుంది.

లోపాలు వెతకడం

మనుషులందరూ ఏదో సందర్భంలో మిస్టేక్ చేస్తారు. రిలేషన్ షిప్‌లోనూ ఇది సర్వ సాధారణం. కానీ కొందరు తరచుగా తమ పార్ట్‌నర్ గతంలో, వర్తమానంలో చేసిన పొరపాట్లను వెతుకుతూ, గుర్తు చేస్తూ డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ పరిస్థితి నిరంతరం కొనసాగితే భవిష్యత్తులో ఇద్దరూ కలిసి ఉండే అవకాశం తగ్గుతుంది. ఎందుకంటే ఎప్పుడూ లోపాలు ఎత్తిచూపడం ఎదుటి వ్యక్తిని మానసికంగా కృంగదీస్తుంది. రిలేషన్ షిప్‌లో ఇది నిరంతరం కొనసాగుతుంటే బాధితులు రాంగ్ పర్సన్‌తో ఉన్నారని అర్థం చేసుకోవాలంటున్నారు నిపుణులు. భార్యా భర్తలు లేదా ప్రేమికుల్లో ఒకరు ఎప్పుడో ఒకసారి జరిగిన మిస్టేక్ గురించి మాట్లాడుతూ ఎదుటి వ్యక్తిని వేధిస్తుంటే.. అది రాంగ్ పర్సన్ సంకేతానికి నిదర్శనం. ఏమాత్రం సందేహం లేకుండా ఎదుర్కోవడానికి సిద్ధ పడాలని నిపుణులు సూచిస్తున్నారు.

మ్యూచువల్ సపోర్ట్ లోపించడం

హెల్తీ రిలేషన్ షిప్‌లో ఇద్దరు వ్యక్తులు పరస్పర సహకారం, పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ గ్రోత్, డ్రీమ్స్ అండ్ యాప్పిరేషన్స్‌కు మద్దతుగా నిలవాలి. ఒకరినొకరు ఎంక్వరైజ్ చేయాలి. కానీ అలా చేయకుండా ఒక వ్యక్తి తన భాగస్వామి గోల్స్‌ను అడ్డుకోవడం, అణగదొక్కడం, సక్సెస్‌ను తక్కువ చేసి చూడటం, ప్రతీ సందర్భంలో చులకన చేస్తూ మాట్లాడం చేస్తుంటే సంబంధంలో ప్రమాద సంకేతంగా పరిగణించాలి. అంతేకాకుండా మీకు సమస్యలు, సవాళ్లు ఎదురైనప్పుడు సపోర్టుగా నిలువకపోవడం కూడా భాగస్వామిలో రాంగ్ పర్సన్ డైనమిక్‌కు సంకేతం కావచ్చు. ఇటువంటి వ్యక్తితో కలిసి ఉంటే మీ పర్సనల్ డెవలప్‌మెంట్‌ సరిగ్గా ఉండకపోగా, సంతోషంగా ఉండలేరు.

ప్రతి విషయాన్నీ పర్సనలైజ్ చేస్తూ..

భాగస్వాముల మధ్య సరైన కమ్యూనికేషన్ లేకపోవడం, పరిస్థితులను పర్సనలైజ్ చేసి అవమానించడం, ప్రతి విషయాన్నీ ఒకరు వ్యక్తిగతంగా తీసుకోవడం అనేవి ఏ సంబంధంలో అయినా అపార్థానికి దారితీస్తాయి. మీ భాగస్వామి తరచుగా అలా చేస్తుంటే, ఉనికిలో లేని, సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తూ వేధిస్తుంటే దానివల్ల మీలో మానసిక దృఢత్వం తగ్గడం తగ్గుతుంది. డిస్పప్పాయింట్ వల్ల జ్ఞానం క్షీణిస్తుంది. అందుకే ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రశ్నించాలి. సమస్యలుంటే పరిష్కరించుకోవాలి. ఈ ప్రపంచంలో పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ లేదని గుర్తుంచుకోండి.

నెగెటివ్ ఎనర్జీలో కూరుకుపోవడం

మీరు ప్రేమించిన లేదా పెళ్లి చేసుకున్న వ్యక్తి ‘రాంగ్ పర్సన్‌’ అని అనేకసార్లు రుజువయ్యాక కూడా రిలేషన్ షిప్‌లో కొనసాగుతుంటే మీరొక స్థిరమైన నెగెటివ్ ఎనర్జీలో కూరుకుపోయి ఉండవచ్చు. ఇది మిమ్మల్ని బాధలు భరించేలా చేస్తుంది తప్ప బయటపడేందుకు సహకరించదు. అందుకే మీ భాగస్వామి ఎటువంటి కారణం లేకుండానే మిమ్మల్ని నిరంతరం అనుమానించడం, అవమానించడం, వేధించడం, మీ గురించి ఇతరులవద్ద తప్పుగా చెప్పడం వంటివి చేస్తుంటే, ప్రతీ విషయంలో మిమ్మల్ని నియంత్రిస్తుంటే అది రాంగ్ పర్సన్ అండ్ టాక్సిక్ బిహేవియర్ అని అర్థం చేసుకోవాలి. ఇది మీ మానసిక శ్రేయస్సును దెబ్బతీస్తుంది. పర్సనల్ గ్రోత్‌‌ను అడ్డుకుంటుంది.

భావోద్వేగ, శారీరక వేధింపులు

రిలేషన్ షిప్‌లో ఒకరు ఎమోషనల్ అండ్ ఫిజికల్ అబ్యూజ్ అనుభవిస్తున్నారంటే బాధితులు తప్పుడు వ్యక్తితో సంబంధంలో ఉన్నారనడానికి ఇది బలమైన సంకేతం. ఎదుటి వ్యక్తిని వేధించడం, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం, చులకన లేదా తక్కువ చేసి చూడటం, నిరంతరం విమర్శించడం, బెదిరించడం, నియంత్రించడం వంటి ప్రవర్తనలు ఇక్కడ సర్వసాధారణంగా ఉంటాయి. ఇవి బాధితుల ఆత్మగౌరవాన్ని, స్వీయ ఉన్నతిని దెబ్బతీస్తాయి. బాధితుల్లో భయాన్ని, అభద్రతా భావాన్ని పెంచుతాయి. ఫలితంగా బాధిత వ్యక్తి తన నిజమైన ఆలోచనలు, భావోద్వేగాలను వ్యక్తపరచలేకపోతారు. ఫలితంగా లోన్లీనెస్, ఐసోలేషన్ పెరిగి పర్సనల్ ఐడెంటిటినీ కోల్పోతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంటే మీరు తప్పు వ్యక్తితో ఉన్నారనే దానికి స్పష్టమైన సంకేతమని గుర్తించాలి.

Advertisement

Next Story