మీ బిడ్డ శరీరం నీలి రంగులో ఉందా..? గుండె సమస్య ఉందేమో చెక్ చేయండి!

by Hajipasha |   ( Updated:2023-01-11 12:20:36.0  )
మీ బిడ్డ శరీరం నీలి రంగులో ఉందా..? గుండె సమస్య ఉందేమో చెక్ చేయండి!
X

దిశ, ఫీచర్స్: పుట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగే ఆ అనుభూతి, ఆనందాన్ని తల్లిదండ్రులు ఎప్పటికీ మరిచిపోలేరు. పింక్ కలర్ స్కిన్‌ టోన్ కలిగిన బిడ్డ ఏడుస్తుంటే.. చిరునవ్వుతో కూడిన వారి కన్నీళ్లు మాటల్లో చెప్పలేని సంతోషాన్ని వివరిస్తాయి. కానీ, కొద్దిమంది పిల్లలు నీలి రంగులో ఉన్న సందర్భాలు చూసి ఉంటారు. దీన్నే 'బ్లూ బేబీ సిండ్రోమ్' లేదా 'ట్రైకస్పిడ్ అట్రేసియా' అని పిలుస్తుంటారు. దాదాపు 10 వేల మందిలో ఒక్క బిడ్డకు వచ్చే ఈ వ్యాధి.. పిల్లల్లో అరుదైన గుండె సమస్యకు సంకేతమని చెబుతున్నారు నిపుణులు.

'ట్రైకస్పిడ్ అట్రేసియా' అంటే ఏమిటి?

సాధారణంగా మన హృదయంలో నాలుగు భాగాలు ఉంటాయి. గుండె కుడివైపున రెండు భాగాల మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యమైనది. ఒకవేళ అది లేనట్లయితే.. శిశువుకు ట్రైకస్పిడ్ అట్రేసియా ఉన్నట్లే. కమ్యూనికేషన్‌లో అవరోధంగా పనిచేసే ఘన కణజాలం ఉన్నట్లయితే.. ఆ పరిస్థితిని 'బ్లూ బేబీ సిండ్రోమ్' అని పిలుస్తారు.

లక్షణాలు:

• ఫీడింగ్ కష్టం

• విపరీతమైన చెమట

• బేబీ సులభంగా అలసిపోవడం

• శిశువు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం

చికిత్స

'ట్రైకస్పిడ్ అట్రేసియా' నుంచి బయటపడేందుకు బిడ్డ మూడు దశల శస్త్రచికిత్సల ద్వారా వెళ్ళవలసి ఉంటుంది. మొదటి దశలో ఊపిరితిత్తులకు రక్తప్రసరణ సముచితంగా ఉండేటటువంటి బ్లాలాక్-టౌసిగ్ (BT) షంట్ లేదా పల్మనరీ ఆర్టరీ బ్యాండింగ్ అవసరం ఉంటుంది. రెండో దశలో శరీరంలోని పైభాగంలోని సిరలు ఊపిరితిత్తులకు అనుసంధానం. మూడవ దశ 'ఫాంటాన్'లో శరీరం దిగువ భాగం నుంచి సిరలు ఊపిరితిత్తులకు అనుసంధానించబడతాయి. ఈ విధంగా అపరిశుభ్రమైన రక్తమంతా గుండెకు వెళ్లకుండా ఊపిరితిత్తులకు బదిలీ చేయబడుతుంది. ఈ విజయవంతమైన మూడు-దశల శస్త్రచికిత్స తర్వాత శిశువు సాధారణ జీవితాన్ని గడపగలడు. కానీ ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు చిన్న పిల్లలను రెగ్యులర్ మెడికల్ చెకప్‌లకు తీసుకెళ్లడం అవసరం.

Advertisement

Next Story

Most Viewed