Parasitic Infection : వామ్మో అలాంటి మాంసం తింటున్నారా.. ఈ ఇన్ఫెక్షన్ రావడం ఖాయం..

by Sumithra |
Parasitic Infection : వామ్మో అలాంటి మాంసం తింటున్నారా.. ఈ ఇన్ఫెక్షన్ రావడం ఖాయం..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : చాలామంది నాన్ వెజ్ ప్రియులు తమకు ఇష్టమైన రెసిపీ ఇంట్లో వండుతున్నారు అంటే చాలు. టేస్ట్ ఎలా ఉందో అని ఉడకకముందే లటుక్కున నోట్లో వేసుకుంటుంటారు. మరి కొన్ని ప్రాంతాల్లో సగం ఉడికిన మాంసాన్ని తింటుంటారు. ఇంకొంతమంది పచ్చిమాంసాన్నే తినేస్తారు. ముఖ్యంగా విదేశాల్లో ఈ అలవాట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. దీంతో వారు అనేక రోగాల బారిన పడాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అంతే కాదండోయ్ ఇలాంటి ఫుడ్ వల్లనే అనేక వైరస్ లు, అనేక ఇన్ఫెక్షన్లు కూడా వస్తుంటాయి. ఈ క్రమంలోనే పచ్చి మాంసం తిన్న ఓ వ్యక్తికి పరాన్నజీవి ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా, జ్వరం, అలసట, ప్రేగు సంబంధిత ఇన్ఫెక్షన్, చర్మం పై దద్దుర్లు లేదా న్యూరోడిజార్డర్ సంభవించవచ్చు. కొన్ని సందర్భాలలో అది మరణానికి కూడా కారణం కావచ్చు. ఇంతకీ ఈ పరాన్న జీవి వ్యాధి అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెరికాలో ఓ వ్యక్తికి పచ్చి మాంసం తిన్న తర్వాత పరాన్నజీవి ఇన్ఫెక్షన్ వచ్చింది. పరాన్నజీవుల సంక్రమణను పరాన్నజీవి సంక్రమణం అంటారు. ఇతర జీవుల నుండి పోషకాహారం తీసుకోవడం ద్వారా జీవించే జీవుల వల్ల కలిగే వ్యాధులు పరాన్నజీవి అంటువ్యాధులని చెబుతున్నారు వైద్యనిపుణులు. కలుషితమైన ఆహారం, మురికి నీరు, కీటకాల కాటు, ఉడకని మాంసాన్ని తినడం ద్వారా పరాన్నజీవుల సంక్రమణ సంభవిస్తుందని చెబుతున్నారు. యాంటీపరాసిటిక్ మందులు పరాన్నజీవి ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తాయంటున్నారు. మీరు ఏదైనా జంతువు పచ్చి మాంసాన్ని తిన్నట్లయితే, పరాన్నజీవి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు.

ఈ ఇన్ఫెక్షన్ కారణంగా, జ్వరం, అలసట, ప్రేగు సంబంధిత ఇన్ఫెక్షన్, చర్మంపై దద్దుర్లు లేదా న్యూరోడిజార్డర్ సంభవించవచ్చని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పరాన్నజీవి అంటువ్యాధుల ద్వారా తరచుగా అతిసారం, వాంతులు వంటి లక్షణాలతో ప్రేగు సంబంధిత సమస్యలకు కారణమవుతాయంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్లలో అనేక రకాలు ఉన్నాయట. వీటిలో ప్రోటోజోవా, పురుగులు, ఎక్టోపరాసైట్‌లు ముఖ్యమైనవని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు పరాన్నజీవి ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారట. అయితే ఈ వ్యాధికి నిర్ణీతమైన చికిత్స కూడా లేదు. మెదడులో ఈ ఇన్ఫెక్షన్ వస్తే రోగి ప్రాణాలను కాపాడడం కష్టమవుతుందంటున్నారు వైద్యనిపుణులు.

పరాన్నజీవి సంక్రమణకు గురయ్యే ప్రమాదం ఎవరికి ఉంది ?

ఎవరైనా పరాన్నజీవి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. చెరువుల దగ్గర నివసించేవారు లేదా మురికి నీరు తాగేవారు కూడా ప్రమాదాల బారిన పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. చెరువుల దగ్గర నివసించే వ్యక్తులలో గియార్డియా లేదా ఇతర పరాన్నజీవులతో సంక్రమణ సాధారణం. ఈ పరాన్నజీవులు నీటి లోపల కనిపిస్తాయి. నీరు తాగినప్పుడు, అవి శరీరంలోకి ప్రవేశించి, ఆపై ఏదైనా భాగంలో లేదా మెదడులోకి ప్రవేశిస్తాయి. దీంతో ఆ వ్యక్తి మరణించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు.

ఎలా కనుక్కోవాలి..

రక్త పరీక్ష

మలం పరీక్ష

ఎండోస్కోపీ లేదా కోలోనోస్కోపీ

ఎక్స్-రే

చికిత్స..

పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధికి సూచించిన చికిత్స లేదు. రోగికి అతని లక్షణాల ప్రకారం చికిత్స చేస్తారు. ఈ కాలంలో కొన్ని యాంటీపరాసిటిక్ మందులు కూడా ఇస్తున్నారంటున్నారు వైద్యనిపుణులు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story