నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏం అవుతుంది అనుకుంటున్నారా?

by Jakkula Samataha |   ( Updated:2024-05-13 07:56:22.0  )
నేను ఒక్కడిని ఓటు వేయకపోతే ఏం అవుతుంది అనుకుంటున్నారా?
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం రాష్ట్రాల్లో ఎన్నికల జాతర కొనసాగుతుంది. ఇక తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్నం నుంచి ఎంతో మంది తమ పల్లెలకు చేరుకుంటున్నారు. అయితే కొంత మంది మాత్రం ఈ ఎన్నికల్లో ఓటు వేయడానికి అంతగా ఆసక్తిచూపనట్లు తెలుస్తోంది. సమ్మర్ కావడం, ట్రాఫిక్, ఫ్రీ బస్సు ఎఫెక్ట్, ఆఫీసుల్లో లీవ్ దొరకకపోవడం ఇలా పలు కారణాల వలన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక కొంతమంది ఓటు వేయవా అని అడగ్గానే.. నా ఒక్క ఓటుతో ఏమౌవుతుంది? నేను ఒక్కడిని వెళ్లి వేయకపోతే పార్టీ గెలవదా.. నేను ఓటు వేయకపోయినా.. నేను సపోర్ట్ చేసే పార్టీ గెలుస్తుంది ఇలా ముచ్చటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఓటు వేయకుండా ఉండిపోతున్నారా.. చరిత్రను చూడండి అంటూ ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఒక్క ఓటు తేడాతో చాలా ప్రభుత్వాలు కూలిపోయాయి.. అధికారం క్షణంలో దూరమైంది.

1576లో అమెరికాలో ఒక్క ఓటు తేడాతో జర్మన్‌కు బదులుగా ఇంగ్లీష్ భాష అధికారిక భాష అయ్యింది.

1714లో ఓక్క ఓటు తేడాతో చింగ్ జార్జ్వన్ ఇంగ్లాండులో పీటమెక్కాడు

1999లో ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి అధికారం కోల్పోయాడు.

ఒక్క ఓటు తేడాతో ఆంగ్లంపై గెలిచి హిందీ మన దేశ జాతీయ బాషగా గుర్తింపు పొందింది.

1923 నవంబర్ 8న జర్మనీలో నాజీ పార్టీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటు తేడాతో ఆడాల్టాట్లర్ ప్రత్యర్థి ఓడిపోయాడు. లేదంటే ప్రపంచ చరిత్ర మరో విధంగా ఉండేదేమో. ఇలా ఒక్క ఓటుతో ఎన్నో సంచలనాలు జరిగాయంట. అందుకే ఓటు అనేది ఓ గొప్ప ఆయుధం.. మన ఓటుతో ఏ అద్భుతమైన జరుగొచ్చు, కాబట్టి తప్పనిసరిగా ఓటు వేయాలి.

Advertisement

Next Story

Most Viewed