వీకెండ్ పిల్లలతో బయటకు వెళ్లండి.. ఇందుకు బలమైన కారణాలున్నాయి...!!

by Sujitha Rachapalli |
వీకెండ్ పిల్లలతో బయటకు వెళ్లండి.. ఇందుకు బలమైన కారణాలున్నాయి...!!
X

దిశ, ఫీచర్స్: వీకెండ్స్ పిల్లలతో తల్లిదండ్రులు బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. చిన్నారులకు మెమొరబుల్ ఈవెంట్స్ అందించాలని చెప్తున్నారు. బిజీ షెడ్యూల్స్, ఇంట్లో ఉంటే బాగుండనే ఆలోచన అవుటింగ్స్, ఫ్యామిలీ ఎక్స్ కర్షన్స్ ను అవాయిడ్ చేస్తే బాగుంటుందని అనిపించొచ్చు. కానీ వీకెండ్ వెకేషన్స్ తో బోలెడు లాభాలున్నాయని ... ఫాలో కావడమే బెటర్ అని అంటున్నారు. ఇవి పిల్లల ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతాయని చెప్తున్నారు.

కుటుంబ బంధాలు బలోపేతం

మన బిజీ వర్క్ షెడ్యూల్స్ ఫ్యామిలీతో నాణ్యమైన సమయాన్ని గడిపేందుకు అడ్డంకిగా మారుతాయి. కాబట్టి వీకెండ్ వెకేషన్ పిల్లలతో స్ట్రాంగ్ కనెక్షన్స్ డెవలప్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాయి. పార్క్, బీచ్, ఫారెస్ట్ టూర్స్, కిడ్స్ వరల్డ్ లాంటివి ట్రై చేయమని సూచిస్తున్నారు నిపుణులు. ఈ అనుభవాలు శాశ్వత జ్ఞాపకాలను సృష్టిస్తాయి. కుటుంబ బంధాలను బలోపేతం చేస్తాయి. తల్లిదండ్రులు పిల్లల మధ్య నమ్మకం, పరస్పర అవగాహన పెంపొందే అవకాశం ఉంది. అంతేకాదు పేరెంట్స్ తమ ఆనందానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పిల్లల్లో భద్రత, సొంతం అనే భావన ఏర్పడుతుంది.

శారీరక ఆరోగ్యం

ప్రస్తుతం పిల్లలు మొబైల్స్ కు అలవాటు పడిపోయారు. స్కూల్ నుంచి వచ్చిందంటే చాలు ఫోన్, లాప్ టాప్, టీవీలకు అతుక్కుపోవడం, వీడియో గేమ్స్ ఆడటం మాత్రమే జరుగుతుంది. కానీ ఔట్ డోర్ గేమ్స్ అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దీనివల్ల శారీరక వ్యాయామం లేక ఊబకాయం, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు దరిచేరుతున్నాయి. ఫ్యాట్ పెరిగిపోయి గుండెపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అలా కాకుండా బయటకు వెళ్తే హైకింగ్, బైకింగ్, స్పోర్ట్స్, వాకింగ్ లాంటివి శారీరక శ్రమను కలిగిస్తాయి. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతాయి. సహజ సూర్యరశ్మికి గురికావడం వల్ల ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తి పనితీరుకు అవసరమైన విటమిన్ డి అందుతుంది.

విద్యాభివృద్ధి

పిల్లల ఎడ్యుకేషన్ పై కూడా విహారయాత్రలు పాజిటివ్ ఇంపాక్ట్ కలిగిస్తాయి. తాము పుస్తకాల్లో చదివిన పురాతన లేదా గొప్ప స్థలాలను నేరుగా సందర్శించడం ద్వారా ప్రాక్టికల్ గా తెలుసుకోగలరు. అలాంటి అనుభవం జీవితాంతం గుర్తుండిపోతుంది. సబ్జెక్ట్ పై మరింత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అందుకే మ్యూజియంలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి నిల్వలు, సాంస్కృతిక కార్యక్రమాల సందర్శనలు ఆకర్షణీయంగా సమాచారంతో కూడిన అభ్యాస అనుభవాలను అందిస్తాయి. జ్ఞానాన్ని పెంపొందిస్తాయి.

ఒత్తిడి దూరం

మోడ్రన్ లైఫ్ స్టైల్ పెద్దలతో పాటు పిల్లల ఒత్తిడికి కారణం అవుతుంది. కాబట్టి వీకెండ్స్ లో కొత్త ప్రాంతాల సందర్శన డెయిలీ రోటీన్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు ఉంటుంది. ప్రశాంతతను అందిస్తుంది. ప్రకృతి విహారయాత్రలు ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన, నిరాశ భావాలను తగ్గిస్తాయి. స్వచ్ఛమైన గాలి మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. సాహసాలను ఆస్వాదించడం మొదలుపెడతారు.

Advertisement

Next Story

Most Viewed