వయనాడ్ ప్రళయం...గుండె తరుక్కుపోయేలా మూడో తరగతి విద్యార్థి లెటర్.. వైరల్

by Sujitha Rachapalli |
వయనాడ్ ప్రళయం...గుండె తరుక్కుపోయేలా మూడో తరగతి విద్యార్థి లెటర్.. వైరల్
X

దిశ, ఫీచర్స్: వయనాడ్ జల ప్రళయం వందల మందిని బలి తీసుకుంది. ఒకప్పుడు ప్రకృతి రమణీయంగా ఉన్న ప్రాంతం మానవ తప్పిదం కారణంగా విధ్వంసాన్ని ఎదుర్కొంది. గుండె బరువెక్కే సంఘటనలకు సాక్ష్యంగా నిలిచింది. అక్కడి పరిస్థితి చూసి దేశం కన్నీరు పెట్టుకుంటుంది. ఇలాంటి సమయంలో లైఫ్ సేవియర్స్ గా బాధిత ప్రాంతానికి చేరుకున్న ఇండియన్ ఆర్మీ రెస్ట్ లెస్ సర్వీస్ అందిస్తుంది. తిండి, నిద్ర లేకుండా నిర్విరామ సేవలు అందిస్తూ.. బాధితులను రక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్మీకి బిగ్ సెల్యూట్ చెప్తున్న మూడో తరగతి విద్యార్థి నోట్స్ వైరల్ అవుతుంది.

' డియర్ ఇండియన్ ఆర్మీ... నేను రియాన్. కొండచరియలు విరిగిపడటం కారణంగా నా ప్రియమైన వయనాడ్ భారీ విపత్తును ఎదుర్కుంటోంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని మీరు రక్షించడం చూస్తుంటే గర్వంగా ఉంది. ఆకలి తీర్చుకునేందుకు కేవలం బిస్కట్లు మాత్రమే తింటూ బ్రిడ్జి బిల్డ్ చేసిన మీ కమిట్మెంట్ నన్ను డీప్ గా టచ్ చేసింది. ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావాలనే స్ఫూర్తి నింపింది ' అంటూ తన నోట్స్ లో రాసుకున్నాడు. ఇది కాస్త వైరల్ కావడంతో ఇండియన్ ఆర్మీ కూడా రియాక్ట్ అయింది.

' డియర్ రియాన్.. నీ అక్షరాలు మా హృదయాన్ని తాకాయి. ఇలాంటి విపత్తులో జనాలకు భరోసాగా ఉంటాం. నీలాంటి హీరోస్ ఇంకా గొప్పగా ఈ పనులు చేసేలా స్ఫూర్తి ఇస్తున్నాయి. నువ్వు ఆర్మీ యూనిఫాం ధరించే రోజు కోసం, నీ పక్కన నిల్చునేందుకు వెయిట్ చేస్తున్నాం ' అని స్పందించింది.


(CREDITS HINDUSTANTIMES INSTAGRAM CHANNEL )

Advertisement

Next Story