- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
తొక్కతో సహా తింటే ఆరోగ్యానికి మేలు చేసేవేమిటో తెలుసా?
దిశ, ఫీచర్స్ : మనం వివిధ రకాల పండ్లను తిన్నప్పుడు వాటి తొక్కలను పడేస్తుంటాం. కానీ వాటివల్ల కూడా ఉపయోగం ఉంటుందని, ఆరోగ్యానికి మేలు చేస్తాయని ఆహార నిపుణులు చెప్తున్నారు. కొన్ని పండ్లను నీటితో కడిగి తొక్కతో సహా తినడం మంచిదట. అలాంటివి పండ్లు ఏవి? ఎటువంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.
పుచ్చకాయ
సమ్మర్‌లో అందరూ ఇష్టపడే పండు పుచ్చకాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. 90 శాతం వరకు నీటిని కలుగి ఉండటంవల్ల దీనిని తినడంతో వేసవిలో ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది. బాడీ డిహైడ్రేషన్ కాకుండా ఉంటుంది. అయితే ఈ పండును పైన ఉండే గ్రీన్ తొక్కను తీసేసి లోపలి భాగాన్ని మాత్రమే చాలామంది తింటుంటారు. కానీ అలా చేయకపోవడం మంచిదంటున్నారు డైటీషియన్లు. ఎందుకంటే పుచ్చకాయ తొక్కలో జింక్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్‌ను పెంచే లక్షణం తొక్కకు ఉంటుంది. అందుకే నీటితో శుభ్రంగా కడిగి తొక్కతో సహా తినడం బెటర్.
మామిడిపండు
వేసవిలో అందరికీ అందుబాటులో ఉండే సీజనల్ ప్రూట్స్‌లో మామిడి పండు ఒకటి. ఈ పండును కూడా లోపలి భాగం తిన తొక్కను వదిలేస్తుటారు చాలా మంది కానీ, ఈ తొక్కలో ఫైటోన్యూట్రియెంట్స్ క్యాన్సర్ ప్రభావాన్ని అరికడతాయట. అంతేగాక తొక్కలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి రోగనిరోధక శక్తికి దోహదం చేస్తాయి. శరీరంపై తగిలి గాయాలు నయం కావడంలో మేలు చేస్తుంది. ఫైబర్ శాతం కూడా మామిడి తొక్కలో ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది.
స్వీట్ పొటాటో
స్వీట్ పొటాటో(చిలగడ దుంప)ను ఉడకబెట్టి తినడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే ఉండక బెట్టాక దానిపై తొక్కను తీసేస్తుంటారు. కానీ అలాగే తింటే ఇంకా మంచిది. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండటంవల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపులు మెరుగు పడుతుంది. ఐరన్, పొటాషియం, ఫైబర్ వంటివి కలిగి ఉన్నందున శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరుగుతాయని వైద్య నిపుణులు చెప్తున్నారు.