- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Sun: భూమిపై నీరు సూర్యుని కంటే పాతది: అధ్యయనం
దిశ, ఫీచర్స్: సూర్యుడు సౌరవ్యవస్థలోని గ్రహాలను ఏర్పరిచాడు. మనుషులతో సహా భూమిపై ఉన్న ప్రతీ పదార్థం సూర్యుడు ఏర్పడుతున్నప్పుడు దాని చుట్టూ తిరుగుతున్న పదార్థం నుంచి ఏర్పడింది. అంటే మనకు సంబంధించినంతవరకు సూర్యుడిని ప్రతిదానికీ ప్రారంభ బిందువుగా పరిగణిస్తుంటాం. కానీ భూమిపై ఉన్న నీటిలో కొంత భాగం సూర్యుడి కంటే పాతది కావచ్చనేది యూరోపియన్ సౌత్ అబ్జర్వేటరీ (ESO) పరిశోధనా బృందం అభిప్రాయం. కాగా V883 ఓరియోనిస్ అనే నక్షత్రం చుట్టూ డిస్క్‌ను ఏర్పరుచుకుంటున్న గ్రహాన్ని పరిశీలించేందుకు బృందం చిలీలోని అటాకామా లార్జ్ మిల్లీమీటర్/సబ్‌మిల్లిమీటర్ అర్రే (ALMA)ని ఉపయోగించే క్రమంలో ఈ ఒపీనియన్‌కు వచ్చింది.
పెద్ద మొత్తంలో ధూళి, వాయువు అకస్మాత్తుగా కొలాప్స్ అయినప్పుడు ప్రోటోస్టార్ ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే నక్షత్రం ఏర్పడటం ప్రారంభమవుతుంది. నక్షత్రాల నిర్మాణం పురోగమిస్తున్న కొద్దీ, ప్రోటోస్టార్ చుట్టూ ఉన్న పదార్థం దాని చుట్టూ తిరగడం ప్రారంభమవుతుంది. మిలియన్ల సంవత్సరాల కాలంలో నక్షత్ర వ్యవస్థలో భాగమైన గ్రహాలు, గ్రహశకలాలు, తోకచుక్కలు ఈ విధంగానే ఏర్పడ్డాయి. నక్షత్రం చుట్టూ ఉన్న గ్రహం ఏర్పడే డిస్క్‌లో ఈ పదార్థంలో పెద్ద మొత్తంలో నీటి అణువులు ఉన్నాయి. పరిశోధనా బృందం ఈ డిస్క్‌లోని నీటి కంటెంట్‌కు సంబంధించిన కెమికల్ సిగ్నేచర్‌ను కాలిక్యులేట్ చేసి.. నీరు ఎక్కడ, ఎప్పుడు ఏర్పడిందనే విషయాన్ని తెలపింది. తోకచుక్కలో కనిపించే వాటర్ కెమికల్ సిగ్నేచర్ భూమిపై మాదిరిగానే ఉంటుంది. కామెట్స్(సూర్యుని చుట్టూ తిరిగే ఘనీభవించిన వాయువులు, రాతి, ధూళి యొక్క కాస్మిక్ స్నో బాల్స్) మన గ్రహానికి నీటిని పంపిణీ చేయగలవని చెప్పవచ్చు.
‘ఈ సందర్భంలో V883 Orionis అనేది మిస్సింగ్ లింక్. డిస్క్‌లోని నీటి కూర్పు మన సొంత సౌర వ్యవస్థలోని తోకచుక్కల మాదిరిగానే ఉంటుంది. గ్రహ వ్యవస్థలలోని నీరు బిలియన్ల సంవత్సరాల క్రితం, సూర్యునికి ముందు, నక్షత్రాల అంతరిక్షంలో ఏర్పడింది. కామెట్ మరియు భూమి రెండింటి ద్వారా సాపేక్షంగా మారదనే ఆలోచనకు ఇది ధృవీకరణ’ అని ఖగోళ శాస్త్రవేత్త జాన్ J. టోబిన్ చెప్పారు.