Water Fasting: 72గంటల వాటర్ ఫాస్టింగ్‎తో శరీరంలో ఏం జరుగుతుంది?

by Vennela |   ( Updated:2025-03-12 07:34:09.0  )
Water Fasting: 72గంటల  వాటర్ ఫాస్టింగ్‎తో శరీరంలో ఏం జరుగుతుంది?
X

దిశ, వెబ్‌డెస్క్: Water Fasting: బరువు తగ్గేందుకు చేసే ఒక ప్రక్రియను వాటర్ ఫాస్టింగ్ అంటారు. ఈ ఉపవాస దీక్షలో దాదాపు 24గంటలు నీళ్లు మాత్రమే తీసుకోవాలి. పండ్ల రసాలు కూడా తాగకూడదు. ఈ వాటర్ ఫాస్టింగ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అధిక బరువు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. వేళాపాళ లేని ఆహార నియమాలు, నిద్రలేమి, పనిఒత్తిడి, జంక్ ఫుడ్స్ ఇవన్నీ అధిక బరువు కారణం అవుతున్నాయి. లైఫ్ స్టైల్లో మార్పు రాకపోతే జిమ్ లో గంటల తరబడి కష్టపడినా పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే సహజ పద్ధతుల్లో బరువు తగ్గితే ఆరోగ్యంతోపాటు అందము కూడా రెట్టింపు అవుతుంది. ఇలాంటి సంప్రదాయ పద్ధతుల్లో ఉపవాసం కూడా ఒకటి. ఇందులో వాటర్ ఫాస్టింగ్ మరీ ప్రత్యేకమని చెబుతున్నారు నిపుణులు. అసలేంటీ వాటర్ ఫాస్టింగ్?

బరువు తగ్గేందుకు చేసే ఒక ప్రక్రియనే వాటర్ ఫాస్టింగ్. ఈ ఉపవాస దీక్షలో దాదాపు 24గంటల నీళ్లు మాత్రమే తీసుకోవాలి. జ్యూసులు కూడా తాగకూడదు. దీన్ని పాటించడం వల్ల కాలేయంతోపాటు కండరాల కణజాలాల్లో నిల్వ ఉన్న గ్లైకోజెన్ వినిమయం అవుతుంది. దీంతో శరీరం బరువు కూడా తగ్గుతుంది. వాటర్ ఫాస్టింగ్ వల్ల శరీరంలో వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయని..జీర్ణక్రియ మెరుగుపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

బరువు తగ్గడానికి, ఇన్సులిన్ సమతుల్యతకు కూడా ఇది సాయపడుతుందని తేలింది. అయితే నీటి ఉపవాసం కారణంగా శరీరంలో విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్లు శాతం పడిపోతుంది. దీంతో బలహీనత ఆవహిస్తుంది. మైకం కూడా వచ్చే ప్రమాదం ఉంది. నిపుణుల సూచన మేరకే ఈ ఉపవాసం చేపట్టాలి. అంతేకాదు డయాబెటిస్, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ వాటర్ ఫాస్టింగ్ చేయకూడదు.

Read More..

Holi Festival: హోలీ పండుగ రోజు ఈ ఒక్క పనిచేస్తే.. ఏడాదంతా డబ్బులే డబ్బులు

Next Story