వాకింగ్ మంచిదే కానీ.. ఏ వయస్సులో ఎంత నడవాలో తెలుసా?

by Dishafeatures2 |
వాకింగ్ మంచిదే కానీ.. ఏ వయస్సులో ఎంత నడవాలో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : నడక ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. కానీ ప్రతి రోజూ నడిస్తే మంచిదా? అప్పుడప్పుడూ నడిస్తే మంచిదా? అసలు ఎంత దూరం నడవాలి? ఎన్ని అడుగులు నడవాలి? వయస్సును బట్టి ఎన్ని స్టెప్స్ నడిస్తే ఆరోగ్యానికి మంచిది? అనే సందేహాలు తరచూ వ్యక్తం అవుతుంటాయి. దీనికి నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం.

వాస్తవానికి వాకింగ్ అనేది ఎటువంటి ఖర్చులేని వ్యాయామం. ఎవరైనా సింపుల్‌గా చేసేయవచ్చు. దీనివల్ల ఫిట్‌నెస్‌తో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అయితే రోజుకూ కనీసం ప్రతీ వ్యక్తి 35 నుంచి 45 నిమిషాలపాటు స్పీడ్ వాకింగ్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఇక ఎన్ని అడుగులు వేయాలనేదానికి సరైన లెక్కలంటూ ఉండవు. కాకపోతే అలసట వచ్చే వరకు నడక కొనసాగించాలి. కాకపోతే 14 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ రోజూ 10 వేల అడుగులు వేయడం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల శరీరంలో రక్త సరఫరా పెగుతుంది. అదనపు కొవ్వు కరిగిపోతుంది. గుండె జబ్బులు వంటివి దరిచేరకుండా ఉంటాయి.

Next Story

Most Viewed