- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతి జిల్లాలో పిడుగులు.. ఇద్దరు స్పాట్ డెడ్
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం విరుచుకుపడింది. దీంతో పలుచోట్ల పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పుత్తూరు మండలంలో ఆదివారం ఉదయం వర్షం కురిసింది. అయితే రామసముద్రం, కృష్ణసముద్రంలో పిడుగులు పడ్డాయి. దీంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. పొలం పనులు చేస్తుండగా పిడుగుపాటుకు గురై చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
మరోవైపు వర్షాలు నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వర్షాలు కురుస్తున్న సమయంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. రైతులు, పశు కాపరులు పొలంలోనూ, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది.
Advertisement
Next Story