మానవులు అంతరించిపోవాలి.. 30 ఏళ్లుగా ఉద్యమం చేస్తోన్న VHEM

by Hajipasha |   ( Updated:2022-12-07 04:40:50.0  )
మానవులు అంతరించిపోవాలి.. 30 ఏళ్లుగా ఉద్యమం చేస్తోన్న VHEM
X

దిశ, ఫీచర్స్: మనుషులను పీడిస్తున్న పర్యావరణ సమస్యలకు మానవ వినాశనమే ఉత్తమ పరిష్కారమని చెప్తోంది వాలంటరీ హ్యూమన్ ఎక్స్‌టింక్షన్ మూవ్‌మెంట్ (VHEM). మనుషులు అంతరించిపోతేనే జీవగోళం బాగుపడుతుందని.. తద్వారా ఇతరు జాతుల మొక్కలు, జంతువులు బాగుపడతాయని పిలుపునిస్తోంది. పోషకాహార లోపం, సంరక్షణ లేమితో భూమిపై పిల్లలు చనిపోతున్నప్పుడు.. ఉద్దేశపూర్వకంగా మరొక మానవుడిని సృష్టించడం సమర్థించబడదని వివరిస్తోంది.

1991లో అమెరికన్ పర్యావరణ కార్యకర్త లెస్ యు. నైట్ స్థాపించిన వాలంటరీ హ్యూమన్ ఎక్స్‌టింక్షన్ మూవ్‌మెంట్ (VHEM).. 30 ఏళ్లుగా మానవులు స్వచ్ఛందంగా అంతరించి పోవాలని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. పెరుగుతున్న జనాభాతో గ్రహం ఎదుర్కొంటున్న సమస్యలు తీవ్రమవుతున్నాయని.. మిలియన్ల కొద్ది ఇతర జాతుల మొక్కలు, జంతువులను అంతరించిపోయేలా చేయబోతున్నామని వివరిస్తోంది. అందుకే VHEM ఫాలోవర్స్ 'ఏ వ్యక్తి అయినా చేయగలిగే చెత్త పర్యావరణ నేరం ఎక్కువ మందిని కనడమే' అని నమ్ముతారు. మన సొంత జాతుల సభ్యులను తిండి, నీరు లేకుండా, వాతావరణ మార్పులతో కష్టపెట్టే బదులు.. మనం అంతరించి ఇతర జాతులను ఎందుకు రక్షించకూడదని ప్రశ్నిస్తోంది.

స్వచ్ఛంద విలుప్తం అంటే అర్థం ఏమిటి?

ఇతర జాతుల ప్రయోజనాల కోసం ప్రజలు తమ జీవితాలను ముగించుకోవాలని VHEM ఉద్యమం కోరడం లేదు. ప్రస్తుతం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ దీర్ఘకాలం, సంతృప్తికరమైన జీవితాలను గడపాలని కోరుకుంటుంది. కానీ సంతానోత్పత్తి మాత్రం వద్దని కోరుతోంది. మానవాళి మొత్తం ఇందుకు అంగీకరిస్తే, మన జాతి ఒక రోజు అంతరించిపోతుంది. ఈ గ్రహాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించని జాతులకు వదిలివేస్తుంది. ఈ క్రమంలో జీవగోళం పూర్తిగా శుభ్రమైనప్పుడు.. ఒక జంట మానవులు ఉంటే మనం మళ్లీ ఈ చోటుకి తిరిగొస్తాం.



Advertisement

Next Story

Most Viewed