- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vitamin K : విటమిన్ కె లభించే ఆహారాలు.. ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు !
దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా ఉండటానికి శరీరానికి కావాల్సిన పోషకాల్లో విటమిన్ కె ఒకటి. ఇది రక్తంలో కాల్షియం లెవల్స్‌ను నియంత్రించడం ద్వారా ఎముకలపై పగులుళ్లు, క్షీణతను అరికడుతుంది. వాటిని బలోపేతం చేస్తుంది. గాయాలు తగిలినప్పుడు అధిక రక్తస్రావాన్ని కంట్రోల్ చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది. జ్ఞాపక శక్తినిం పెంచుతుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అందుకే ప్రతిరోజ విటమిన్ కె లభించే ఆహారాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అవేమిటో చూద్దాం.
ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే అరటిపండ్లలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. వీటిని తరచగా తినడంవల్ల అజీర్తి, అధిక బరువు వంటి సమస్యలు దూరం అవుతాయి. ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల ఆహారం చక్కగా జీర్ణమై రక్త ప్రసరణను మెరుగు పర్చేందుకు సహాయపడుతుంది. బ్రోకలీలోనూ విటమిన్ కె ఫుల్లుగా ఉంటుంది. మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్, సెలీనియం, ఫైబర్ వంటివి ఉండటంవల్ల మేలు జరుగుతుంది. వీటితోపాటు బాదం, జీడిపప్పు, కోడిగుడ్లు, బ్లూ బెర్రీస్, అవకాడో, ఆకుకూరలు వంటివి కూడా విటమిన్ కె కలిగి ఉంటాయి. కాబట్టి ఆహారంలో భాగంగా వీటిని తీసుకుంటూ ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.