బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన యువకుడు.. అంతలో ఏం జరిగిందంటే..

by Javid Pasha |   ( Updated:2024-08-21 08:33:33.0  )
బైక్‌తో సహా వరదలో కొట్టుకుపోయిన యువకుడు.. అంతలో ఏం జరిగిందంటే..
X

దిశ, ఫీచర్స్ : గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేని వానలతో జనం మస్తు అవస్థలు పడుతున్నారు. మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు హైదరాబాద్‌లో కురిసిన వానవల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపోంటి, గల్లీల పోంటి నీరు వరదలై పారింది. కొన్నిచోట్ల ఇండల్లోకి నీళ్లు రావడంతో జనం కంటిమీద కునుకులేకుండా పోయింది. వివిధ పనులు, ఆఫీసుల నుంచి సాయంత్రం ఇంటికి తిరుగు ప్రయాణం అయినవారు రోడ్లపై ట్రాఫిక్ జామ్ కావడంతో గంటల తరబడి వర్షంలో తడుస్తూ ఉండిపోయారు. కొన్నిచోట్ల పార్కింగ్‌లో ఉంచిన వాహనాలు నీటి మునిగిపోయాయి. మరికొన్నిచోట్ల టూవీలర్లు కొట్టుకుపోయాయి.

తాజాగా మంగళవారం నాటి వాన బీభత్సానికి హైదరాబాద్‌లో ఓ యువకుడు స్కూటీపై వెళ్తుండగా వరద ధాటికి కిందపడిపోయాడు. అతను నీటిలో కొట్టుకుపోతుండగా చుట్టు పక్కల ఉన్నవాళ్లు గమనించి రక్షించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరో యువకుడు కూడా కొట్టుకుపోయాడు. ఈ సంఘటన జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఇందిరా నగర్‌లో జరిగింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ స్కూటీపై ఉన్న యువకుడు ఎక్కడో ఒకచోట ఆగాల్సిందిపోయి, అలాగే ముందుకు వెళ్లాడు. ఒక్కసారిగా కిందపడిపోయి నీటి ప్రవాహంలో తేలుతూ కొట్టుకుపోసాగాడు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇతరులు గమనించడంవల్ల కాపాడగలిగారు కానీ..ఏమై పోయేవాడో అంటూ పలువురు రియాక్ట్ అవుతున్నారు. వర్షం కురుస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త పాటించాలని సూచిస్తున్నారు.

Click here for Twitter video : https://x.com/NaseerGiyas/status/1825741225724424636

Advertisement

Next Story

Most Viewed