జంతువుల్లో హెల్పింగ్ నేచర్.. ఆకలితో ఉన్న మేకను చూసి ఆ గేదె ఏం చేసిందో చూండండి!

by Javid Pasha |   ( Updated:2024-08-23 06:30:37.0  )
జంతువుల్లో హెల్పింగ్ నేచర్.. ఆకలితో ఉన్న మేకను చూసి ఆ గేదె ఏం చేసిందో చూండండి!
X

దిశ, ఫీచర్స్ : మంచితనం, మానవత్వం మనుషుల్లోనే కాదు.. జంతువుల్లోనూ ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. తమకు చేతనైన సహాయం చేస్తూ మనుషులు ఇతరులకు సహాయపడినట్లే.. తమకు తోచిన పద్ధతుల్లో వివిధ జీవరాశులు కూడా ఇతర ప్రాణులకు హెల్ప్ చేస్తుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇక్కడ ఆకలితో ఉన్న ఓ మేకకు గేదె చేసిన సహాయం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. బాగా ఆకలితో ఉన్న ఒక మేక ఆహారం కోసం చుట్టు పక్కల వెతుకుతుంది. ఆ సందర్భంలో దానికి ఎక్కడా మేత దొరకలేదు. చుట్టు పక్కల కొన్ని చెట్లు ఉన్నప్పటికీ అవి పెద్దగా ఉండటంతో వాటి ఆకులు తినడానికి మేకకు సాధ్యం కాలేదు. ఇక చేసేదేమిలేక ఓ గేదెను కట్టేసిన చెట్టు వద్దకు వెళ్లి నిల్చుంటుంది. ఈ సందర్భంలో మేకను గమనించిన గేదెకు ఏం అర్థమైందో కానీ.. ఓ విధమైన హావ భావాలతో మేకవైపు చూస్తుంది. అంతేకాకుండా మేక తన వీపుపై ఎక్కి చెట్టు ఆకులను తినేందుకు సహాయపడుతుంది. గేదె చూపులను, దాని సైగలను అర్థం చేసుకున్న మేక కూడా గేదె తలమీద కాళ్లు పెట్టి, దాని వీపు మీదకు ఎక్కి చెట్టు ఆకులను తినేస్తుంది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. మానవత్వం, హెల్పింగ్ నేచర్ మనుషుల్లోనే కాదు, జీవరాశులన్నింటిలోనూ ఉంటుందని కొందరు. మనుషులు ఎలా ఉండాలో గేదెను చూసి నేర్చుకోవాలని ఇంకొందరు రియాక్ట్ అవుతున్నారు.

Video Credits to rupin sharma Ips X Id

Advertisement

Next Story

Most Viewed