Viral video : ఒక్కసారిగా వీచిన తుపాను గాలి.. గొడుగుతోపాటు ఎగిరిపోయిన వ్యక్తి

by Javid Pasha |
Viral video : ఒక్కసారిగా వీచిన తుపాను గాలి.. గొడుగుతోపాటు ఎగిరిపోయిన వ్యక్తి
X

దిశ, ఫీచర్స్ : సునామీలు, తుపానులు, ఈదురు గాలులు వంటి ప్రకృతి వైపరీత్యాలు మానవ జీవితంపై ప్రభావం చూపుతాయి. వాటి తీవ్రతను బట్టి కొన్నిసార్లు ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడూ ఎవరూ ఊహించని విచిత్ర పరిణామాలు కూడా జరుగుతుంటాయి. తాజాగా అటువంటి సిచ్యువేషన్‌కు అద్దంపట్టేలా ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతూ క్యూరియాసిటీ పెంచుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. చైనాలో గల హెబీ ప్రావిన్స్‌లోని లాంగ్‌ ఫాంగ్‌లో తుపాను కారణంగా బలమైన గాలులు వీస్తున్నాయి. దీంతో ఓ కుటుంబం తమని తాము సేవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇంటి బయట ఉన్న వస్తువులను లోపలికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి గొడుగు పట్టుకోగా బలమైన తుపాను గాలికి గొడుగుతోపాటు ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరిపోయాడు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ దృశ్యాన్ని @weatherchannel అనే ఇన్‌స్టా హ్యాండిల్‌లో సదరు యూజర్ షేర్ చేయగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి మరి.

Advertisement

Next Story

Most Viewed