viral : పాత ఇంటిని కూల్చివేస్తుండగా బయటపడిన మట్టి కుండ.. ఓపెన్ చేసి చూడగా!

by Javid Pasha |
viral : పాత ఇంటిని కూల్చివేస్తుండగా బయటపడిన మట్టి కుండ.. ఓపెన్ చేసి చూడగా!
X

దిశ, ఫీచర్స్ : పునాదులు తవ్వుతుండగానో, పురాతన కట్టడాలను కూల్చుతుండగానో నిధి నిక్షేపాలో, చారిత్రక ఆనవాళ్లో బయటపడ్డాయనే వార్తలు మనం అప్పుడప్పుడూ వింటుంటాం. ప్రజెంట్ అలాంటి ఓ సంఘటనే టర్కీలో జరిగింది. హిస్టారికల్ విశేషాల కోసం పురావస్తుశాఖ నిపుణులు అన్వేషణ ప్రారంభించగా.. ఓ మట్టికుండ బయట పడింది. దానిని ఓపెన్ చేసిన చూసిన శాస్త్రవేత్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఏం జరిగిందంటే..

అది పశ్చిమ టర్కీలోని చారిత్రక నగరం. పేరు నోషన్. నిరంతర అన్వేషణలో భాగంగా అక్కడి ఆర్కియాలజిస్టులు తవ్వకాలు జరుపుతున్నారు. అందులో భాగంగా ఓ పురాతన నిర్మాణంగా ప్రసిద్ధి చెందిన ఇంటిని కూల్చివేయడం ప్రారంభించారు. కాసేపటికి ఓ మట్టి కుండ బయటపడింది. దానిని ఓపెన్ చేసి చూసిన శాస్త్రవేత్తలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే అది పురాతన బంగారు నాణేలతో నిండి ఉన్నట్లు గుర్తించారు.

కాగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించిన బంగారు నాణేలు ఒకప్పుడు పెర్షియన్ సామ్రాజ్యంలో ఉపయోగించిన గోల్డ్ కాయిన్ అయిన పెర్షియన్ డారిక్‌ను పోలి ఉన్నట్లు వారు కనుగొన్నారు. వీటిపై మోకాలి ఆకారంలోని విలుకాడి చిత్రం కూడా ఉంది. అయితే గ్రీకు చరిత్రకారుడైన జెనోఫోన్ ప్రకారం.. అప్పట్లో గ్రీకు సైనికుల నెలవారీ జీతం కోసం ఈ ‘ఒక్క డారిక్ కాయిన్’ అంటే ఒక్క బంగారు నాణెం వినియోగించారు. ఇకపోతే నోషన్‌కు ఈశాన్యంవైపు సుమారు 98 కిలో మీటర్ల దూరంలో ఉన్న సార్డిస్‌లో ఈ నాణేలు ముద్రించబడి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రజెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు క్యూరియాసిటీతో రియాక్ట్ అవుతున్నారు.

Advertisement

Next Story