- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
viral: తల్లి గోల్డ్ చైన్ కొట్టేసి మరీ.. గర్ల్ ఫ్రెండ్‌కు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన స్టూడెంట్!
దిశ, ఫీచర్స్: బర్త్ డే వస్తోందంటే చాలు.. పిలల్లో, యువతలో తెగ ఆరాటం కనిపిస్తుంది. పుట్టిన రోజు తమదైనా, తమ స్నేహితులదైనా అదో రకమైన ఉత్సాహంలో మునిగిపోతారు. కొత్త డ్రెస్సులు, కేక్ కటింగులు, గిఫ్టులు వంటివి గుర్తు చేసుకొని మురిసిపోతుంటారు. అంత వరకూ ఓకే కానీ.. కొందరిలో ఇదొక మానియాలాగా మారిపోతోందని పెద్దలు, నిపుణులు అంటున్నారు. సరదాలు, సంతోషాలు, బహుమతుల పేరుతో కొందరు తప్పుదారి పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఓ సంఘటనే ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తన ఫ్రెండ్ బర్త్ డేకు గిఫ్ట్ ఇవ్వడం కోసం ఓ స్టూడెంట్ ఏకంగా తన తల్లి గోల్డ్ చైన్‌నే దొంగిలించాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..
వైరల్ సమాచారం ప్రకారం.. ఢిల్లీలోని నజఫ్‌గఢ్ ఏరియాలో నివసిస్తున్న ఓ మహిళ తాను ఇంటిలో దాచుకున్న రెండు గోల్డ్ చైన్‌లు, ఒక జత చెవిపోగులు, రింగ్ కనిపించడం లేదని గుర్తించింది. ఆగష్టు 3న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి పరిసరాల్లోని సీసీ ఫుటేజీలు చెక్ చేసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఇంటివాళ్లపైనే అనుమానంతో విచారణ జరిపించగా.. అసలు విషయం తెలిసి, అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే..
గోల్డ్ చైన్‌లు, ఇతర ఆభరణాలు ఏ దొంగలో ఎత్తుకుపోలేదు. ఫిర్యాదు చేసిన మహిళ కొడుకే ఆ పని చేశాడు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు స్కూల్లో 9వ తరగతి చదువుతున్న సదరు బాలుడు.. తన గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే ఉందని, గిఫ్ట్ కోసం డబ్బులు కావాలని ముందుగానే తల్లిని అడిగితే ఇవ్వలేదట. దీంతో ఎలాగైనా తన ఫ్రెండుకు ఖరీదైన గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్న బాలుడు, తల్లి బంగారు గొలుసు, ఇతర నగలు తీసుకెళ్లి, వాటిని అమ్మి, ఫ్రెండ్ బర్త్ డేకు గిఫ్టుగా ఐ ఫోన్ కొనిచ్చాడు. ఈ సంఘటనలో బాలుడిని, ఆ గోల్డ్ చైన్ కొన్న వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. 9వ తరగతిలోనే గర్ల్ ఫ్రెండ్ ఏంటి?.. తల్లి నగలు దొంగిలించి మరీ అంత కాస్ట్‌లీ గిఫ్ట్ ఇవ్వడమేంటి? అనే సందేహాలతోపాటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే గిఫ్ట్ మానియా పెరిగిపోతోందంటూ కామెంట్లు పెడుతున్నారు.