సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీసీ సజ్జనార్.. లెజెండ్ అంటున్న నేషనల్ మీడియా

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-22 11:27:32.0  )
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీసీ సజ్జనార్.. లెజెండ్ అంటున్న నేషనల్ మీడియా
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం ఎక్కడ చూసినా కోల్ కతా డాక్టర్ రేప్ కేసు గురించి చర్చ జరుగుతుంది. ఈ ఘటన జరిగాక కూడా నర్సుపై అత్యాచారం, చిన్నారులపై లైంగిక వేదింపులు.. ఇలా దేశవ్యాప్తంగా జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ ఆడపిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ లో 2019లో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్యాచారం కేసుపై డిస్కషన్ జరుగుతుంది. ఈ కేసు విషయంలో వీసీ సజ్జనార్ ఇన్ స్టాంట్ జస్టిస్ ఇచ్చారని.. ఆయన లెజెండ్ అని పొగిడేస్తున్నారు. ఇలాంటి లెజెండ్స్ మన సమాజానికి చాలా అవసరమని అంటున్నారు.

కాగా 2019 నవంబర్ లో శంషాబాద్ లో 26 ఏళ్ల అమ్మాయిపై గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ జరిగింది. ఒకరోజు తర్వాత ఆమె బాడీ షాద్ నగర్ లో లభ్యమైంది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించారు. డిసెంబర్ 6న కేసు రిక్రియేషన్ గురించి నిందితులను తీసుకెళ్లిన పోలీసులు.. హైదరాబాద్ - బెంగళూరు నేషనల్ హైవే సమీపంలో ఎన్ కౌంటర్ చేశారు. పోలీసులపైకి గన్స్ తో ఎటాక్ చేసే క్రమంలో ప్రాణ రక్షణ కొరకు ఇలా చేసినట్లు తెలిపారు. దీంతో దేశ వ్యాప్తంగా సజ్జనార్ పై ప్రశంసల వర్షం కురిసింది. ఈ విధంగా న్యాయం చేసిందందుకు చాలా మంది అమ్మాయిలు 100కు డయల్ చేసి థాంక్స్ చెప్పారు.

Advertisement

Next Story